శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

లాటిన్ అమెరికా పర్యటనకు పోప్ లియో

2 గంటల క్రితం

leo
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 09:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​రోమ్ : ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు శస్త్రచికిత్స చేయించుకున్న మూడు వారాల అనంతరం పోప్ లియో లాటిన్ అమెరికా పర్యటనను ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పెరూకు వెళతారు. పోప్ ఆరోగ్య పరిస్థితిని గురించి ఎలాంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం లేదని వాటికన్ తెలిపింది. ఆయనను ‘శాశ్వత అనారోగ్య సమస్యలు ఉన్న వ్యక్తి’గా కాకుండా శస్త్రచికిత్స చేయించుకున్న 71 ఏండ్ల వ్యక్తిగా మాత్రమే పరిగణించాలని చెప్పింది. పెరూతో పాటు పోప్ లియో ఉరుగ్వే, అర్జెంటీనా దేశాల్లో కూడా పర్యటిస్తారు. ఈ పర్యటన అమెజాన్ నుంచి ఆండీస్ పర్వతాల వరకూ వేలాది మైళ్ల దూరం సాగుతుంది. తొలుత ఉరుగ్వేలో పర్యటించే పోప్ లియో ఆ తర్వాత అర్జెంటీనా వెళతారు. పోప్ పర్యటనలోని ముఖ్యమైన ఘట్టాలను భక్తులు దూరం నుంచి వీక్షించేందుకు వీలుగా రోమ్ చర్చి లోపల ఓ పెద్ద తెరను ఏర్పాటు చేశారు. పోప్ తన పర్యటనలో దేశాధినేతలతో సమావేశంకానున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్