శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హార్ముజ్‌ జలసంధిలో మందుపాతరల పేలుడు.. నావికుడు మృతి

8 గంటల క్రితం

Sailor killed
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026, 01:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

టెహ్రాన్‌ : హార్ముజ్‌ జలసంధిలో చమురు ట్యాంకర్లపై జరిగిన దాడుల్లో గ్రీకు ట్యాంకర్‌లోని ఓ నావికుడు మరణించినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. గురువారం ఈ జలసంధిలో మందుపాతరలను ఢీకొనడంతో ఐదు చమురు ట్యాంకర్లు, ఓ టగ్‌నౌక మంటల్లో చిక్కుకున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది. మార్షల్‌ దీవుల జెండాతో ప్రయాణిస్తున్న ‘వెలోస్‌ సఫైర్‌’ ట్యాంకర్‌ బహ్రెయిన్‌ వైపు వెళ్తుండగా దాడి జరిగిందని, ఆ సమయంలో నౌకలో ఎలాంటి సరుకు లేదని మీడియా తెలిపింది. నౌక ఎడమవైపు గుర్తుతెలియని వస్తువు ఢీకొనడంతో మంటలు చెలరేగి పేలుడు సంభవించి ఉండవచ్చని పేర్కొంది. మరో రెండు ట్యాంకర్లు కూడా మంటల్లో చిక్కుకున్నట్లు ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ వెల్లడించింది. హార్ముజ్‌ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మరో ట్యాంకర్‌ కెప్టెన్‌ ఒమన్‌ సమీపంలో నౌక ఎడమవైపు, నీటిమట్టానికి సమీపంలో పేలుడు సంభవించినట్లు నివేదించారని బ్రిటిష్‌ సముద్రయాన సంస్థ యూకేటీఎంఓ శుక్రవారం తెలిపింది. అయితే నౌకలోని సిబ్బంది సురక్షితంగా ఉన్నారని, నౌక ప్రయాణాన్ని కొనసాగిస్తోందని పేర్కొంది.

నిబంధనలను ఉల్లంఘించి అనధికార మార్గంలో ప్రయాణించేందుకు ప్రయత్నించిన రెండు చమురు ట్యాంకర్లు మందుపాతరలను ఢీకొన్నాయని ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ తెలిపింది. హార్ముజ్‌ జలసంధికి తూర్పున ఒకటి, జలసంధి లోపల మరొకటి ప్రయాణించిన ఈ ట్యాంకర్లు తమ నావిగేషన్‌, గుర్తింపు వ్యవస్థలను నిలిపివేసి అమెరికా సైన్యం మద్దతుతో జలసంధి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాయని పేర్కొంది. మందుపాతరలను ఢీకొనడంతో వాటికి మంటలు అంటుకుని నిలిచిపోయాయని స్థానిక మీడియాలో ఒక ప్రకటనలో తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్