శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హూతీ క్షిపణులు, డ్రోన్లను కూల్చివేసిన సౌదీ అరేబియా

1 రోజు క్రితం

హూతీ క్షిపణులు, డ్రోన్లను కూల్చివేసిన సౌదీ అరేబియా
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026, 11:03 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

రియాద్: దేశంలోని వివిధ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని హూతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులతో పాటు ఒక డ్రోన్‌ను అడ్డుకుని ధ్వంసం చేసినట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజామున ఈ దాడుల యత్నాలు జరిగాయి. రాజధాని రియాద్‌ను లక్ష్యంగా చేసుకుని దూసుకొచ్చిన రెండు బాలిస్టిక్ క్షిపణులను వైమానిక రక్షణ దళం ఆకాశంలోనే కూల్చివేసింది.

మంగళవారం రియాద్‌లోని ఆర్థిక ప్రాంతంలో ఉన్న ఒక బహుళ అంతస్తుల భవనంపై జరిగిన హూతీ డ్రోన్ దాడిలో 11 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఆ ఘటన జరిగిన కొద్దిసేపటికే మళ్లీ ఈ దాడులకు పాల్పడ్డారు. పశ్చిమ ప్రాంతం వైపు ప్రయోగించిన ఒక క్రూయిజ్ క్షిపణిని, జెడ్డా ఓడరేవు సమీపంలోకి వచ్చిన ఒక డ్రోన్‌ను సైన్యం నిర్వీర్యం చేసింది. శకలాలు పడటం వల్ల ఎవరికీ గాయాలు కాలేదని సంకీర్ణ దళాల ప్రతినిధి తుర్కీ అల్ మాలికీ స్పష్టం చేశారు.

మరోవైపు, దక్షిణ సౌదీలోని జిజాన్ ఓడరేవులో హూతీలు ప్రయోగించిన ఒక ప్రొజెక్టైల్ (క్షేపణి) పడింది. ఈ ఘటనలో స్వల్ప ఆస్తి నష్టం మాత్రమే జరిగిందని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. అది ఏ రకమైన ప్రొజెక్టైల్ అనే విషయంపై అధికారులు పరిశీలన జరుపుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్