గురువారం, 03 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

1050కి పెరిగిన నేపాల్‌ మృతులు

1 రోజు క్రితం

Severe floods in Nepal... 23 bodies found in a single house.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 11:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఖాట్మండు : నేపాల్‌ ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 1050కి చేరిందని విపత్తు నిర్వహణా అధికారులు మంగళవారం తెలిపారు. కాగా గల్లంతైన 4 వేల మందికి పైగా ఆచూకీ ఇంకా తెలియరాలేదు. దేశంలోని ఎనిమిది జిల్లాల నుండి మరిన్ని మృత దేహాలను భద్రతా బలగాలు వెలికితీస్తూనే వున్నారని అధికారులు తెలిపారు.

హిమనీ నదం కూలిపోయి ప్రస్తుతం నేపాల్‌‌లో సంభవించిన ఈ ప్రకృతి విపత్తు ఒక హెచ్చరిక వంటిదని నేపాల్‌ ‌విదేశాంగ మంత్రి శిశిర్‌ ‌కనాల్‌ ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. హిమాలయ పర్వత ప్రాంత దేశమైన నేపాల్‌‌కు రోజు రోజుకు పెరుగుతున్న వాతావరణ ముప్పులకు ఈ వరదలే ఒక హెచ్చరికగా నిలిచాయన్నారు. ‌జల ప్రళయంతో నేపాల్‌ గత వారం రోజులుగా తల్లడిల్లుతున్నది. రోజుల తరబడి గాలింపు చర్యలుచేపట్టినా తమవారు కానరాక, ఇక వారిపై ఆశలు వదులుకుని అనేక కుటుంబాలు మంగళవారం సామూహిక అంత్యక్రియల కార్యక్రమాలను నిర్వహించాయి. దిష్టిబొమ్మలను తయారుచేసి వాటికి ప్రతీకాత్మకంగా సాంప్రదాయ రీతిలో ఈ అంత్యక్రియలను చేపట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్