గురువారం, 05 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి

1 గంట క్రితం

అమెరికాలో కాల్పుల కలకలం
-  ఇద్దరు మృతి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026, 09:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం, టంపా సమీపంలోని బ్రాండన్ సిటీబ్యాంక్ సెంటర్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళా ఉద్యోగి, కాల్పులు జరిపిన వ్యక్తి మృతిచెందగా, మరో నలుగురు గాయపడ్డారు. మధ్యాహ్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి కారుతో సిటీబ్యాంక్ సెంటర్‌ క్యాంపస్‌లోకి దూసుకొచ్చాడని, సెక్యూరిటీ ఫెన్సింగ్‌ను ఢీకొట్టి, ఉద్యోగులు భోజనం చేస్తున్న ఔట్‌డోర్‌ డైనింగ్‌ ప్రాంతానికి చేరుకుని, అనంతరం కారులో నుంచి రైఫిల్‌ను తీసి కాల్పులు జరిపాడని పోలీసు అధికారలు తెలిపారు. ఆ సమయంలో అక్కడ ఓ మహిళా ఉద్యోగి మృతిచెందింది. తుపాకీతో క్యాంపస్‌లో తిరుగుతున్న వ్యక్తిని గమనించిన సిటీబ్యాంక్‌ సెక్యూరిటీ గార్డు అతడిని అడ్డుకునేందుకు కాల్పులు జరిపాడు. ఇద్దరి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. గార్డు కాల్పులతో ఆ వ్యక్తి కిందపడిపోయాడు. అతడిని టంపాలోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన సమాచారం అందుకున్న వందలాది మంది పోలీసులు సిటీబ్యాంక్‌ సెంటర్‌కు చేరుకున్నారు. కాల్పులు జరిగిన సమయంలో ఆ కార్యాలయంలో సుమారు 3,200 మంది పనిచేస్తున్నారు. తుపాకీతో తిరుగుతున్న వ్యక్తికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్