శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

AI models - ఎఐ మోడళ్ల దూకుడు.. ప్రభుత్వ వెబ్‌ సైట్లలోకి చొరబాటు

11 గంటల క్రితం

The aggressive rise of AI models... infiltration into government websites.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 02:56 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రభుత్వ వెబ్‌సైట్లలోకి ఎఐ మోడళ్లు

సైబర్‌ భద్రతపై పెరుగుతున్న ఆందోళనలు

ఆందోళన కలిగిస్తున్న ‘ఏజెంట్ గోయింగ్ రోగ్’ వైఖరి


వాషింగ్టన్‌ (అమెరికా) : ఓపెన్ ఎఐ (OpenAI) కి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) ఏజెంట్లు అమెరికా ప్రభుత్వ వెబ్‌సైట్లలోకి అక్రమంగా ప్రవేశించినట్లు వెలువడిన కథనాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వ ఆరోగ్య రక్షణ విభాగానికి చెందిన సైట్‌పై సైతం ఇదే తరహా దాడి జరిగినట్లు వెల్లడైన కొద్ది రోజుల్లోనే యుఎస్ లోనూ సైబర్ చొరబాటు ఘటన వెలుగుచూసింది.


ఎఐ మోడళ్ల అసాధారణ ప్రవర్తనను పరిశీలిస్తున్న సమయంలో ఓపెన్ ఎఐ స్వయంగా ఈ విషయాన్ని గుర్తించింది. యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్‌కు చెందిన రెండు వెబ్‌సైట్లతో పాటు, యుఎస్ సెన్సస్ బ్యూరో వెబ్‌సైట్‌లోకి ఎఐ ఏజెంట్లు చొరబడినట్లు తేలింది. వీటిలోని పబ్లిక్ డేటాను మాత్రమే యాక్సెస్ చేసినట్లు అధికారులు స్పష్టం చేసినప్పటికీ, భద్రతా నియమాలను ధిక్కరించి ఈ హాకింగ్ జరగడం గమనార్హం.


ఈ చొరబాటు వల్ల వెబ్‌సైట్లకు గానీ, డేటాబేస్‌కు గానీ ఎలాంటి నష్టం వాటిల్లనప్పటికీ, ఎఐ ఏజెంట్లు స్వతంత్రంగా లాగిన్ కావడానికి ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, కామర్స్ డిపార్ట్‌మెంట్లతో పాటు కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూయార్క్ వంటి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ వెబ్‌సైట్లలో కూడా ఇటువంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినట్లు 'ట్రాన్స్‌లూస్' నివేదించింది. "మిస్‌అలైన్డ్ మోడల్ యాక్టివిటీ" పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో ఈ అంశాలు బయటపడ్డాయి. దీనిపై సమగ్ర విచారణ కొనసాగుతోందని ఓపెన్ ఎఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ తెలిపారు.


కలకలం రేపిన 'హగ్గింగ్ ఫేస్' ఘటన :

ప్రముఖ ఎఐ స్టార్టప్ కంపెనీ 'హగ్గింగ్ ఫేస్' వెబ్‌సైట్‌పై జరిగిన దాడి ఈ విభాగంలోనే అతిపెద్దదిగా నిలిచింది. పెద్ద సంఖ్యలో ఎఐ ఏజెంట్లు ఒక్కసారిగా ఈ సైట్‌లోకి చొరబడటం గమనార్హం.


మానవులు ఇచ్చే ప్రాథమిక ఆదేశాలను దాటి, తమ మార్గంలో వచ్చే అడ్డంకులను అధిగమించడానికి ఎఐ ఏజెంట్లు స్వయంగా హాకింగ్ పద్ధతులను ఉపయోగించడాన్ని సాంకేతిక పరిభాషలో "ఏజెంట్ గోయింగ్ రోగ్" (Agent Going Rogue) గా వ్యవహరిస్తారు. ఓపెన్ ఎఐ, ఆంత్రోపిక్ లతో పాటు పలు అధునాతన మోడళ్లు కేవలం ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికే పరిమితం కాకుండా.. ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేయడం, కంప్యూటర్లలోకి ప్రవేశించి సొంతంగా కోడింగ్ రన్ చేయడం వంటి 'ఆటోనామస్ ఏజెంట్' సామర్థ్యాలను కలిగి ఉంటున్నాయి. ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తే, దాన్ని సాధించడానికి ఎలాంటి అడ్డంకినైనా దాటడానికి ఇవి ప్రయత్నిస్తున్నాయి.


ఈ క్రమంలోనే ఆంత్రోపిక్, క్లాడ్, జెమిని వంటి మోడళ్లపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఫ్రెంచ్, చైనా ఎఐ మోడళ్లపై ఇప్పటివరకు ఇటువంటి ఆరోపణలు రాలేదు. వాటికి కఠినమైన భద్రతా గోడలు (సారథ్యం) ఉండటమే కాకుండా, ల్యాంగ్వేజ్ మోడల్స్‌గా ప్రైవేట్ క్లౌడ్‌పై ఆధారపడకుండా డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించే విధానం కలిగి ఉండటం దీనికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్