భారత్‌పై 25శాతం విధింపు
మరో 13 దేశాలకూ సుంకాల సెగ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ టారీఫ్ బాంబు పేల్చారు. దీంతో ఆర్థిక యద్ధానికి మరోసారి తెరలేపారు. తమ మార్కెట్లను చౌక వస్తువులతో ముంచెత్తుతున్నాయని ఆరోపిస్తూ, చైనా, యూరోపియన్ యూనియన్, భారతదేశంతో సహా 14 ప్రధాన వాణిజ్య భాగస్వాములపై కొత్తగా వాణిజ్య సుంకాలను ట్రంప్ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 25 శాతం సుంకం విధించింది. భారత్ విధానాలు, పద్ధతులకు ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నామని పేర్కొంది. అంతేకాదు, తమ దేశ వాణిజ్యానికి ఈ దిగుమతులు భారంగా మారిందని తెలిపింది. అయితే, అమెరికా, భారత్ మధ్య ‘అగ్రిమెంట్ ఆన్ రెసిప్రోకల్ ట్రేడ్’ కుదిరితే భారత్‌పై సుంకం 17 శాతానికి తగ్గవచ్చని అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం (యూఎస్‌టిఆర్) ఉత్తర్వులో పేర్కొంది. ఈ 25 శాతం సుంకాలు ప్రస్తుతం అమలులో ఉన్న సుంకాలను మినహాయిస్తామంది. అయితే, ఇతర సుంకాలను పరిగణనలోకి తీసుకుని ఈ కొత్త సుంకాలను సర్దుబాటు చేయాలా వద్దా అన్నది యూఎస్‌టిఆర్ నిర్ణయిస్తందని స్పష్టం చేసింది. 1974 నాటి అమెరికా వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 కింద తాజా సుంకాలు విధించామని తెలిపింది. అమెరికా వ్యాపారాల పట్ల అన్యాయంగా వ్యవహరించే దేశాలను శిక్షించే అధికారం ఈ సెక్షన్‌కు ఉంది. ట్రంప్ తన మొదటి పదవీకాలంలో చైనా వస్తువులపై భారీ సుంకాలు విధించడానికి దీనిని ఉపయోగించారు. అలాగే, అమెరికా తన ట్రేడ్ ఎక్స్పాన్షన్ చట్టంలోని సెక్షన్ 232 కింద అన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే అల్యూమినియం, ఉక్కుపై 50 శాతం సుంకం విధిస్తోంది. కొత్త సుంకాలను వీటికి కలపరు. అలాగే ‘లిండ్సే ఓ. గ్రాహం సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026’ ప్రకారం, రష్యా చమురును భారీగా దిగుమతి చేసుకునే భారత్ వంటి దేశాలపై 100 శాతం వరకు సుంకం విధించే అధికారం అమెరికా ప్రభుత్వానికి ఉందని గతంలోనే తెలిపింది. అయితే, చైనాతో పాటు, బంగ్లాదేశ్, కంబోడియా, యూరోపియన్ యూనియన్, భారతదేశం, ఇండోనేషియా, జపాన్, దక్షిణ కొరియా, మలేషియా, సింగపూర్, స్విట్జర్లాండ్, తైవాన్, థాయిలాండ్, వియత్నాంలపై టారీఫ్‌లు ప్రకటించింది. అలాగే, మెక్సికో, నార్వేలకు ప్రస్తుతానికి మినహాయించింది.








కామెంట్లు (0)