బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్‌..

07 అక్టోబర్, 2026

Ukraine drone
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026, 12:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​మాస్కో : రష్యాలోని చమురు ట్యాంకర్‌పై ఉక్రెయిన్ విరుచుకుపడింది. దీంతో భారీ అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. దక్ష‍ిణ రష్యా సముద్ర తీరంలోని ఒక చమురు నౌకపై మంగళవారం సాయంత్రం ఉక్రెయిన్‌ డ్రోన్‌లతో దాడి చేసింది. లైబీరియా జెండా ఉన్న ఒక ట్యాంకర్‌పై ‘‘నౌకాదళ డ్రోన్‌లు’’ దాడి చేశాయని, దీంతో నల్లసముద్రంలోని జలాల్లో చమురు మండిపోతోందని రష్యా రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. మంటల తీవ్రత అధికంగా ఉందని, దీంతో అగ్నిమాపక సిబ్బంది వాటిని అదుపు చేయలేకపోయారని వెల్లడించింది. నౌకలోని 23మంది సిబ్బందిని రక్ష‍ించారని, వీరంతా భారతీయులేనని పేర్కొంది. డ్రోన్‌ దాడితో సుమారు 5 లక్షల జనాభా ఉన్న ప్రముఖ నగరమైన సోచిని మంటలు, దట్టమైన పొగ చుట్టుముడుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

తీరప్రాంతానికి, బీచ్‌ల్లోకి ప్రవేశాన్ని నియంత్రించినట్లు నగర మేయర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తమ పట్టణాలు, నగరాలపై దాడులకు ప్రతికారంగానే రష్యా చమురు మౌలిక సదుపాయాలపై తాము దాడులు చేస్తున్నామని ఉక్రెయిన్ వెల్లడించింది. ఇటీవల దాడులను తీవ్రతరం చేస్తామని ఇరు దేశాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్