టాలిన్ (ఎస్తోనియా) : ఎస్తోనియా అధ్యక్షులుగా ఉల్లే మాడిస్ బుధవారం ఎన్నికయ్యారు. 101 మంది సభ్యులు గల పార్లమెంట్‌లో అసాధారణంగా జరిగిన సమావేశంలో ఆమె ఎన్నికయ్యారు. ఎస్తోనియా న్యాయ శాఖ ఛాన్సలర్‌గా పనిచేస్తున్న ఆమెకు 71 మంది ఎంపీల మద్దతు లభించింది. రహస్య బ్యాలెట్‌లో ఎన్నికవాలంటే సభలో మూడింట రెండు వంతుల మెజారిటీ అంటే 68ఓట్లు అవసరం కాగా ఆమెకు 71 మంది మద్దతు లభించిందని పార్లమెంట్ ప్రత్యక్ష ప్రసార విభాగం తెలిపింది. 78 మంది సభ్యులు ఓటు వేయగా, అందులో ఏడు ఓట్లు చెల్లలేదని సంబంధిత అధికారులు తెలిపారు. ఎస్తోనియా ఏడవ అధ్యక్షులుగానూ, ఈ పదవిని చేపట్టిన రెండో మహిళగానూ రికార్డు సృష్టించనున్నారు. అక్టోబరు 12న ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎస్తోనియా అధ్యక్ష ఎన్నికల్లో రాజకీయేతర అభ్యర్ధిగా ఆమెకు అనేక ప్రధాన పార్టీలు మద్దతునిచ్చాయి. ప్రస్తుత అధ్యక్షులు అలర్ కరిస్ రెండోసారి పోటీకి దిగనని జూన్‌లో చెప్పడంతో మాడిస్‌ను ఎన్నుకున్నారు.
Print Editionఎస్తోనియా అధ్యక్షులుగా ఉల్లే మాడిస్
19 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 11:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)