అమెరికా కోర్టు ఆదేశాలు
వాషింగ్టన్ : జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రా (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) మాజీ చీఫ్ సమంతా గోయల్‌లకు ఢిల్లీ కోర్టుల ద్వారా నోటీసులు అందజేయాల్సిందిగా అమెరికా ఫెడరల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఖలిస్తానీ వేర్పాటువాది గురు పత్వంత్ సింగ్ పన్నూన్ దాఖలు చేసిన కేసుకు సంబం ధించి ఈ సమన్లు జారీ అయ్యాయి. కాగా వివిధ ఉగ్రవాద ఆరోపణలపై భారత దర్యాప్తు సంస్థలు పన్నూన్‌ను భారత్‌కు రప్పించడానికి ప్రయత్నిస్తున్నాయి. అజిత్ దోవల్‌కు సమన్లును, అవసరమైన ఇతర జ్యుడీషియల్ పత్రాలను పంపించాల్సిందిగా న్యూయార్క్ దక్షిణ జిల్లా కోర్టు నవంబరు 13న ఆదేశాలు జారీ చేసింది. అలాగే ద్వారక, తీస్ హజారీ జిల్లా కోర్టుల ద్వారా గోయల్‌కు సమన్లు అందచేయాలని కోరింది. ఈమేరకు భారత న్యాయస్థానాల సేవలను అభ్యర్ధిస్తూ న్యాయమూర్తి కేథరిన్ పోల్క్ ఫైలా ఉత్తర్వులు జారీ చేశారు. అంతర్జాతీయ న్యాయస్థానం ఒప్పందాలను, భారత సివిల్ ప్రోసీజర్ కోడ్ (సిపిసి) నిబంధనలను ఉటంకిస్తూ జడ్జి ఫైలా, భారత న్యాయస్థానాల ద్వారా విదేశీ న్యాయస్థానాలు దోవల్, గోయల్‌లకు సమన్లు జారీ చేయవచ్చన్నారు. పన్నూన్‌ను హత్య చేసేందుకు పన్నిన కుట్రలో భారత పాత్ర వుందని ఆ దావా అరోపిస్తోంది.








కామెంట్‌లు (0)