శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హెచ్‌-1బీ వీసాలపై అమెరికా ప్రభుత్వ నిఘా పెంపు

5 గంటల క్రితం

h1b
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 09:16 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

వాషింగ్టన్‌: హెచ్‌-1బీ వీసా దరఖాస్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం మరింత కఠిన పరిశీలనకు ఆదేశించింది. హెచ్‌-1బీ ఉద్యోగులను స్పాన్సర్‌ చేసే సంస్థలు గత ఏడాదిలో అమెరికా ఉద్యోగులను తొలగించాయా? భవిష్యత్తులోనూ ఇలాంటి ఉద్యోగ కోతలకు ప్రణాళికలు ఉన్నాయా? అనే అంశాలను దరఖాస్తుల పరిశీలనలో పరిగణనలోకి తీసుకోవాలని సంబంధిత శాఖలను ఆదేశించింది. అమెరికా కార్మిక, విదేశాంగ, హోంల్యాండ్‌ సెక్యూరిటీ శాఖలు ఇతర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో దాఖలైన లేబర్‌ కండిషన్‌ అప్లికేషన్లను కూడా 30 రోజుల్లో సమీక్షించాలని కార్మిక శాఖను ఆదేశించారు. అయితే అమెరికా ఉద్యోగులను తొలగించిన సంస్థల హెచ్‌-1బీ దరఖాస్తులను తప్పనిసరిగా తిరస్కరించాలని ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. ఉద్యోగ కోతలను దరఖాస్తుల పరిశీలనలో ఒక అంశంగా పరిగణించాలని మాత్రమే ఆదేశించారు. ఇదే సమయంలో కొన్ని హెచ్‌-1బీ దరఖాస్తులకు 1 లక్ష డాలర్ల చెల్లింపు నిబంధనను మరో 12 నెలలు కొనసాగిస్తూ ట్రంప్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధన 2026 సెప్టెంబర్‌ 21 నుంచి అమల్లోకి రానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్