వాషింగ్టన్ : భారత్‌లో ఎస్‌ఐఆర్ పేరుతో 13 కోట్ల మంది ఓటర్ల పేర్లు తొలగించడంపై అమెరికా కాంగ్రెస్ సభ్యులు ప్రమీలా జయపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు. అమెరికా చట్టసభ సభ్యులు ఒకరు.. ఎస్‌ఐఆర్‌పై వ్యాఖ్యానించడం ఇదే మొదటిసారి. ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటు హక్కులను దెబ్బతీయడానికి అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాన్ని భారతదేశంలోనూ అనుసరిస్తున్న పరిణామాలు కనిపిస్తున్నాయని జయపాల్ విమర్శించారు. భారత సంతతికి చెందిన ప్రమీలా జయపాల్ వాషింగ్టన్ రాష్ర్టం నుంచి డెమోక్రటిక్‌ల తరుపున అమెరికా కాంగ్రెస్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాలను పరిరక్షించడం అత్యవసరమని, అమెరికా ప్రజల మాదిరిగానే భారత ప్రజలు కూడా స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలకు అర్హులని జయపాల్ ఈ పోస్టులో తెలిపారు. భారత్‌లో జరుగుతున్న అహింసాత్మక నిరసనలకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.
ఎస్‌ఐఆర్‌పై అమెరికా చట్టసభ్యుల ఆందోళన
3 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 15, 2026, 11:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)