శాన్ డియాగో : అమెరికాలోని కాలిఫోర్నియాలో ఎఫ్-35బీ స్టీల్త్ ఫైటర్ (F-35B Stealth Fighter) విమానం కూలింది. ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది. శాన్ డియాగోలోని మిరామర్ ఎయిర్‌బేస్ వద్ద ఈ ఘటన జరిగింది. యుద్ధ విమానం నేలరాలడానికి ముందే దాంట్లో ఉన్న పైలట్ పారాచూట్ సాయంతో బయటకు వచ్చేశాడు. ప్రస్తుతం అతనికి సమీప ఆస్పత్రిలో చికిత్స జరుగుతున్నట్లు అమెరికా మెరైన్ కార్ప్స్ తెలిపారు. విమానం కూలిన ప్రదేశం నుంచి దట్టమైన నల్లటి పొగ, మంటలు వ్యాపిస్తున్న దృశ్యాలు వీడియోకు చిక్కాయి. మిలిటరీ సిబ్బబంది, అగ్నిమాపక వాహనాలు ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. రెండు విమానాలు రన్‌వేపై ల్యాండ్ అయ్యే సమయంలో మొదటి విమానం సురక్షితంగా దిగిందని, ఇక రెండో విమానం కాసేపు గాలిలోనే ఉండిపోయిందని, భూమికి సుమారు 100 ఫీట్ల ఎత్తులో ఉన్న సమయంలో దాని పైలట్ ఎజక్ట్ అయ్యాడని, ఆ విమానం మరో విమానం పక్కనే కూలిపోయిందని ఓ వ్యక్తి వెల్లడించాడు. స్టీల్త్ విమానం రన్‌వే మీదకు వెళ్లిన తర్వాత పేలినట్లు శాన్ డియాగో అగ్నిమాపక సిబ్బంది ప్రతినిధి కాండేస్ హాడ్లే తెలిపారు. శాన్ డియాగోలో నేవీ ఫైటర్ పైలట్ల శిక్షణ స్కూల్ ఉన్నది. మెరైన్ కార్ప్స్ ఈ బేస్‌ను వినియోగిస్తున్నారు. 2024 ప్రభుత్వ డేటా ప్రకారం అమెరికాకు చెందిన మెరైన్ కార్ప్స్, నేవీ, ఎయిర్ ఫోర్స్ వద్ద సుమారు 630కి పైగా ఎఫ్-35 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఎఫ్-35బీ స్టీల్త్ ఫైటర్ విమానం ఖరీదు సుమారు 109 మిలియన్ల డాలర్లు ఉంటుందని భావిస్తున్నారు.
Video - అమెరికాలో కూలిన ఎఫ్-35 బి స్టీల్త్ ఫైటర్ విమానం
01 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 01, 2026, 12:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)