సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎన్నికలకు ముందే ఇరాన్ పై దాడులు

4 గంటల క్రితం

ఎన్నికలకు ముందే ఇరాన్ పై దాడులు
‌- ఇరాన్‌‌పై యుద్ధంలో విజయం సాధిస్తాం
-  ట్రంప్‌ బెదిరింపులు
- దేనికైనా సిద్ధమేనన్న ఇరాన్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 11:47 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఇరాన్‌‌పై యుద్ధంలో విజయం సాధిస్తాం

  • ట్రంప్‌ బెదిరింపులు

  • దేనికైనా సిద్ధమేనన్న ఇరాన్‌

వాషింగ్టన్‌ : ఇరాన్‌‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా అత్యంత త్వరలోనే విజయం సాధిస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పాత పాట పాడారు. అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందుగానే ఇరాన్‌‌పై తాజా దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఫ్యాక్స్‌ ‌న్యూస్‌‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ ‌యుద్ధానికి స్వస్తి పలికితే అంతర్జాతీయంగా చమురు ధరలు బాగా తగ్గుతాయని వ్యాఖ్యానిం చారు. ఇరాన్‌‌కు అణ్వాయుధం దక్కకుండా చూడాలని ఆయన నొక్కి చెప్పారు. ‘త్వరలో ఈ యుద్ధంలో అమెరికా గెలవబోతోందని, అందులో విజయం సాధించగానే యుద్ధానికి ముందు స్థాయికి చమురు ధరలు తగ్గిపోతాయి.’’ అని ట్రంప్‌ ‌చెప్పారు.

యుద్ధానికి సిద్ధంగానే ఉన్నాం : ఇరాన్‌

ఇదిలావుండగా, ఈ వారాంతంలో అమెరికా, ఇరాన్‌‌ల మధ్య ప్రతిష్టంభన మరింత ముదిరింది. అంతర్గతంగా దౌత్య ప్రయత్నాలు సాగుతున్నప్పటికీ ఇరు పక్షాలు మాటల యుద్ధాన్ని కొనసాగించాయి. కీలకమైన హర్మూజ్‌‌ను తిరిగి తెరిచే ఉద్దేశ్యమే లేదని ఇరాన్‌ ‌స్పష్టం చేస్తోంది, దౌత్యానికి మార్గాలు తెరిచే వున్నా, తాము యుద్ధ పునరుద్ధరణకు కూడా పూర్తి స్థాయిలో సిద్ధపడే వున్నామని ఇరాన్‌ ‌తేల్చి చెబుతోంది. ఈ మేరకు సుప్రీం నేత ముజ్తబా ఖమేనీ, విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరగ్చి స్పష్టం చేశారు. అదే దౌత్యానికి కూడా తాము సిద్ధమేనని, ఏది ఎంచుకోవాలన్నది అమెరికానే చూసుకోవాలని అన్నారు. కాగా అమెరికా జలాంతర్గత డ్రోన్‌‌ను తాము స్వాధీనం చేసుకున్నామన్న ఇరాన్‌ వార్తలను అమెరికా కొట్టివేసింది. మరోవైపు ఈయుద్ధంలో తమదే విజయమని ఇరాన్‌ ‌చెబుతోంది. ఇరాన్‌ ‌సీనియర్‌‌ జనరల్‌ ఒకరు మాట్లాడుతూ, తమపై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు, ఒత్తిళ్లును సడలించేదాక హర్మూజ్‌ ‌మూతబడే వుంటుందని స్పష్టం చేశారు. కాగా అమెరికాతో చర్చలు ప్రారంభించేందుకు వీలుగా ఇరాన్‌ ‌తన అణు కార్యక్రమంపై రాయితీలు ఇవ్వాలని మధ్యవర్తులు కోరుతున్నారంటూ వాల్‌స్ట్రీట్‌ ‌జర్నల్‌ పేర్కొంది. అయితే ఇరాన్‌ పక్షం ఇందుకు ససేమిరా అంటోంది. అమెరికా ఒత్తిళ్ళను తాము దీటుగా ఎదుర్కొనగలమని స్పష్టం చేస్తోంది.

సముద్ర మార్గాన్ని తెరవడానికి సిద్ధమే!

‘‘ఈ ఘర్షణలను ఆపేందుకు వీలుగా సముద్ర మార్గాన్ని తిరిగి తెరవడానికి ఇరాన్ సిద్ధంగా ఉంది. అయితే చట్టవిరుద్ధంగా స్తంభించజేసిన మా డబ్బులు, మా ఆస్తులను విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం. మేము మా చమురును అమ్ముకోగలగాలని ఆశిస్తున్నాం. ఇప్పుడు మేము దౌత్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాం. మేము శాంతి కోసం లభించే ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు’’ అని అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్