వాషింగ్టన్ : చిప్ తయారీ దిగ్గజం ఎన్విడియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెట్టుబడులు భారీగా పెరిగినట్లు వాషింగ్టన్ పోస్టు కథనం వెల్లడించింది. 2024 చివరి నాటికి ఈ సంస్థలో ట్రంప్ కలిగి ఉన్న షేర్ల విలువ 6.15 లక్షల డాలర్ల నుంచి 13 లక్షల డాలర్ల మధ్య ఉండగా.. ప్రస్తుతం వాటి విలువ 1.3 కోట్ల డాలర్ల నుంచి 6.2 కోట్ల డాలర్ల వరకు ఉంటుందని అంచనా వేసింది. ట్రంప్ ఇటీవల వెల్లడించిన ఆర్థిక వివరాల్లో ఆయన చివరి రెండు నెలల లావాదేవీలు మాత్రం లేవని పేర్కొంది. చైనాకు చిప్‌ల సరఫరా, ఎన్విడియాతో ట్రంప్ ప్రభుత్వ సంబంధాలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ పెట్టుబడుల వివరాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు ఎన్విడియాతో పాటు మరో రెండు డజన్ల చిప్ తయారీ, కృత్రిమ మేధ (ఎఐ) సంస్థలను జాతీయ ప్రాధాన్య సంస్థలుగా ప్రకటించేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఎన్విడియాలో ట్రంప్ భారీ పెట్టుబడులు..
18 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 18, 2026, 06:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)