శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఈ నెలలో జిన్‌‌పింగ్‌, ట్రంప్‌, పుతిన్‌ సమావేశం ?

15 నిమిషాల క్రితం

china
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026, 11:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బీజింగ్‌ : చైనా అధ్యక్షుడు జిన్‌‌పింగ్‌, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ‌మధ్య చారిత్రక సమావేశం నిర్వహించే విషయమై చర్చిస్తున్నట్లు తొలిసారిగా చైనా ధృవీకరించింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్‌ ఈ వారంలో బీజింగ్‌‌లో నిర్వహించిన పత్రికా సమావేశంలో తెలిపారు. మూదు దేశాల అధినేతల మధ్య సమావేశం విషయమై సంబంధిత పక్షాలతో చర్చలు జరుపుతున్నామన్నారు. షెన్‌‌జెన్‌‌లో జరిగే ప్రాంతీయ సమావేశం నేపథ్యంలో ఈ నెల్లో ఈ సమావేశం జరిగే అవకాశం వుందన్నారు. అయితే ఇంకా ఏదీ నిర్ణయం కాలేదన్నారు. ఒకవేళ అదేగనుక జరిగితే అదొక చారిత్రక సమావేశమే కాగలదని వ్యాఖ్యానించారు. ముగ్గురు నేతల ప్రయోజనాలు భిన్నమైనవి అయినందున దేనిపైనా వారు గణనీయంగా చర్చించే అవకాశం లేదన్నారు. ఫోటో కోసం వారు సమావేశమవుతారు. ఈ సమావేశాన్ని చైనా చాలా జాగ్రత్తగా రూపొందిస్తుందన్నారు. ఏ తరహాలో వుండాలి, ఎలాంటి సమాచారం వుండాలనేది పకడ్బందీగా ప్రణాళిక రూపొందిస్తుందన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్