శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

క్యూబాపై వెనిజులా తరహా ఆపరేషన్?

20 జూన్, 2026

trump
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 20, 2026, 11:36 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- దాడి చాలా త్వరగా ముగుస్తుంది

- ట్రంప్ వ్యాఖ్యలు

​వాషింగ్టన్ : ఆరు దశాబ్దాలకు పైగా అమెరికా ఆర్థిక ఆంక్షలు క్యూబా ఎదుర్కొంటుంది. దీంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. దిగ్బంధనాల ఫలితంగా విద్యుత్ కోతలు, ఆహారం, ఇంధనం, తాగునీరు, మందుల కొరత దేశాన్ని వేధిస్తోంది. అయితే క్యూబా లొంగిపోకుండా పోరాడటంతో అమెరికా ఆగ్రహిస్తోంది. ట్రంప్‌ అధ్యక్షుడైన తరువాత బెదిరింపులు పరంపర కొనసాగుతోంది. తాజాగా ఆక్సియోస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యూబాపై దాడి చేస్తే అది వెనిజులా తరహా ఆపరేషన్‌ పోలి ఉంటుందని, అంతేకాకుండా అది చాలా వేగంగా ముగుస్తుందని, క్యూబా చాలా దగ్గరగా ఉందని, అది సాధ్యమేనంటూ బెదిరించారు.

​ట్రంప్ ఏమన్నారంటే..?

ఆక్సియోస్ విలేకరి మార్క్ కాపుటో.. క్యూబా ఆపరేషన్.. వెనిజులా మిషన్ మాదిరిగానే సాగుతుందా? అని అడిగినప్పుడు, ట్రంప్ ‘బహుశా అది సాధ్యమే’ అని బదులిచ్చారు. ‘ఈ ప్రదేశాలు దగ్గరగా ఉన్నాయి. అదే ఇరాన్ వైపు చూస్తే, అది చాలా సూదూర ప్రయాణం. నేను ఆ ప్రాంతానికి కొన్నిసార్లు వెళ్ళాను. దీనికి సంబంధం లేకపోయినా, మీరు 18 గంటలు ప్రయాణిస్తారు. చాలా కాలం ప్రయాణిస్తారు. వెనిజులా దగ్గరగా ఉంది. క్యూబా దూరం చాలా తక్కువ. వెనిజులాకు చమురు ఉంది. క్యూబాకు లేదు. క్యూబాకు మంచి ఆస్తి, మంచి తీరప్రాంతం ఉన్నాయి’ అంటూ ట్రంప్‌ చెప్పుకొచ్చారు. అలాగే ఇరాన్ ఆపరేషన్ ‘ఒక విధంగా, వెనిజులా కంటే చాలా పెద్దది, ఆయుధాల పరంగా చాలా శక్తిమంతమైనది’ అని ట్రంప్ అన్నారు. ‘కానీ వెనిజులా ఒక సైనిక రాజ్యం. వారికి చాలా మంది సైనికులు ఉన్నారు. మేము అనుకూలమైన పరిస్థితుల్లో వెళ్ళలేదు’ అని అన్నారు. అలాగే క్యూబాలో ఆపరేషన్ ఎప్పుడని విలేకరి అడగ్గా.. అందుకు ట్రంప్ నిరాకరించారు. అయితే, క్యూబా మూలాలున్న విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ‘చాలా వరకు ఇందులో పాలుపంచుకున్నారు’ అని ఆయన అన్నారు. అయితే, క్యూబా 300 సైనిక డ్రోన్‌లను కొనుగోలు చేసిందని, వాటిని గ్వాంటనామో బేలోని అమెరికా స్థావరం, అమెరికా సైనిక నౌకలు, ఫ్లోరిడాపై దాడి చేయడానికేనని నిఘా వర్గాలు తెలిపాయంటూ అమెరికా విషప్రచారం చేస్తుంది. అయితే ట్రంప్ రెండో పర్యాయం అధ్యక్షుడైన తరువాత పశ్చిమాసియాలో తమ సైనిక శక్తిని ప్రదర్శించాడనికి, బలమైన శక్తిగా నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని పలువురు విశ్లేషిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్