శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

హార్ముజ్‌ జలసంధిలో నౌకపై దాడి

26 జూన్, 2026

Cargo ship reports suspected attack
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 26, 2026, 06:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

లండన్‌ /ఏథేన్స్‌ : హార్ముజ్‌ జలసంధి నుండి వెళుతుండగా ఒమన్‌ తీరంలో సరుకు నౌకపై దాడి జరిగినట్లు బ్రిటీష్‌ నౌకాదళ సంస్థ యుకెఎంటిఒ గురువారం తెలిపింది. ఒమన్ నౌకాశ్రయమైన 'దహిత్‌కు ఆగ్నేయంగా 7.5 నాటికల్ మైళ్ల దూరంలో, తమ నౌకను ఒక మిసైల్‌ ఢీకొట్టినట్లు సమాచారం అందిందని వెల్లడించింది. ఈ దాడి వల్ల నౌక బ్రిడ్జ్‌కు నష్టం వాటిల్లిందని, అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారని, నౌకలు జాగ్రత్తగా ప్రయాణించాలని సూచిస్తున్నారని పేర్కొంది. దాడికి గురైన నౌక సింగపూర్‌ జెండా కలిగిన 'ఎవర్ లవ్లీ' అనే కంటైనర్ షిప్ అని, ఈ ఘటనను ఒక దాడిగా నిర్ధారించామని తెలిపింది.

ఫిబ్రవరి చివరలో ఇరాన్ అమెరికా, ఇజ్రాయిల్‌లు దాడులు చేపట్టినప్పటి నుండి గల్ఫ్‌ ప్రాంతంలో చిక్కుకుపోయిన వందలాది నౌకలను అక్కడి నుండి వెళ్లేందుకు సహాయం అందిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ సముద్రయాన సంస్థ (ఐఎంఒ) తెలిపింది.





ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్