శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇరాన్‌ అణు సమాచారమిస్తే 2కోట్ల డాలర్లు !

3 గంటల క్రితం

amsa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026, 08:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ప్రకటించిన అమెరికా సెంట్రల్‌ కమాండ్‌

వాషింగ్టన్‌: ఇరాన్‌ అణు కార్యక్రమం గురించి సమాచారమిచ్చిన వారికి అమెరికా రివార్డ్‌‌ను ప్రకటించింది. విలువైన ఆ సమాచారాన్ని అందిస్తే వారికి 2కోట్ల డాలర్ల బహుమతిని ఇచ్చి, వారిని వేరే ప్రాంతానికి తరలించే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నట్లు అమెరికా మిలటరీ శుక్రవారం ప్రకటించింది. యుద్ధాన్ని ముగించాలంటే ఇరాన్‌ ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‌పునరుద్ఘాటించారు. ఇరాన్‌ అణు కేంద్రాలు, పరికరాలు, సిబ్బంది, శాస్త్రవేత్తలు ఇలా అణు కార్యక్రమానికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని అందచేయాల్సి వుంటుందని అమెరికా సెంట్రల్‌ ‌కమాండ్‌ ‌తెలిపింది. ఈ మేరకు ఎక్స్‌‌లో పోస్టు పెట్టింది. అమెరికన్ల ప్రాణాలు, వారి ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన సమాచారాన్ని ఇచ్చినట్లైతే వారికి బహుమతి అందచేస్తామంటూ 1984లో అమెరికా జాతీయ భద్రతా విభాగం ‘రివార్డ్స్‌ ‌ఫర్‌ ‌జస్టిస్‌’ ‌పేరిట చేపట్టిన కార్యక్రమం కింద ఈ రివార్డును ప్రకటించారు. అయితే ఏ సమాచారమిస్తే 2కోట్ల డాలర్లు అందుతాయో నిర్దిష్టంగా ఎలాంటి నిబంధనలు లేవు. ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని అమెరికా బలగాల సమూలంగా తుడిచిపెట్టాయని ట్రంప్‌ ‌పదే పదే చెప్పుకుంటున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్