సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బెర్లిన్‌లో అరుణోదయం

22 ఆగస్టు, 2026

left
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 22, 2026, 09:25 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- మేయర్‌‌ ఎన్నికల్లో గెలుపుదిశగా లెఫ్ట్‌ పార్టీ అభ్యర్ధి

- ఒపీనియన్‌ పోల్స్‌‌లో ఆధిక్యత

బెర్లిన్‌ : బెర్లిన్‌లో ఎర్ర పతాకలు రెపరెపలాడుతున్నాయి. అక్కడ జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వామపక్ష‍ డీ లింకెకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. జర్మనీ పునరేకీకరణ తర్వాత, 1990లో బెర్లిన్‌ ‌గోడ బద్దలైన తర్వాత మొట్టమొదటిసారిగా లెఫ్ట్‌ పార్టీ (డీ లింకె)కి చెందిన అభ్యర్థి బెర్లిన్‌ ‌మేయర్‌గా ఎన్నిక కావచ్చు. సెప్టెంబరు 20న జరగనున్న బెర్లిన్‌ ‌మున్సిపల్‌ ఎన్నికలకు లెఫ్ట్‌ ‌పార్టీ జాబితాకు ఎలిఫ్‌ ఎరాల్ప్‌ (45) ‌నాయకత్వం వహిస్తున్నారు. సోషలిస్టు టర్కీష్‌ ‌వలసదారుల కుటుంబానికి చెందిన ఆమె తాజాగా నిర్వహించిన ఒపీనియన్‌ ‌పోల్‌‌లో ఆధిక్యంలో వున్నారు.

లెఫ్ట్‌ ‌పార్టీ బెర్లిన్‌ ‌నగరంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం 18వేల మందికి పైగా వలంటీర్లను మోహరించింది. బెర్లిన్‌‌లో బాగా ఎక్కువగా వున్న ఇళ్ళ అద్దెలపై, పెరుగుతున్న జీవన వ్యయ ప్రమాణాలను తగ్గించడంపై పోరు సల్పడంపై పార్టీ ప్రధానంగా దృష్టి పెట్టింది. తక్కువ జీవన వ్యయానికి ఒకప్పుడు పేరు గాంచిన బెర్లిన్‌ ‌నగరంలో ఇటీవల ధరలు విపరీతంగా పెరిగిపోవడం అక్కడి ప్రజలను బాగా ఇబ్బంది పెడుతోంది.

నయా నాజీ భావజాలం కలిగిన ఆల్టర్నేటివ్‌ ‌ఫర్‌‌ జర్మనీ (ఎఎఫ్‌‌డి) పార్టీకి మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో వలసదారుల కుమార్తె నేతృత్వంలోని లెఫ్ట్‌ ‌పార్టీకి రాజధాని నగరంలో విజయం దక్కే అవకాశం లభించినట్లైతే అదొక ఊపిరి పీల్చుకునే పరిణామంగా భావించవచ్చు.

క్రిస్టియన్‌ ‌డెమోక్రటిక్‌ ‌పార్టీ (సిడియు), సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ‌పార్టీ (ఎస్‌‌పిడి)ల కూటమి ప్రస్తుతం బెర్లిన్‌ ‌నగరాన్ని పాలిస్తోంది. ప్రస్తుత మేయర్‌, కన్జర్వేటివ్‌ ‌కయీ వాగ్నర్‌ ‌గత నెల్లో బలవంతంగా ఎన్నికల్లో పోటీ నుండి వైదొలగాల్సి వచ్చింది. జనవరిలో ఒక విద్రోహక చర్య కారణంగా బెర్లిన్‌ ‌నగరంలో పెద్ద ఎత్తున చోటు చేసుకున్న విద్యుత్‌ ‌అంతరాయంపై తన స్పందన గురించి అడగ్గా అబద్ధం చెప్పినట్లు ఆయన వెల్లడించారు. దాంతో ఎన్నికల బరి నుండి తొలగాల్సి వచ్చింది. ఈ విద్యుత్‌ అంతరాయం కారణంగా రోజుల తరబడి 45వేల మందికి పైగా ప్రజలు గడ్డ కట్టే చలిలో విద్యుత్‌, హీటింగ్‌ ‌వ్యవస్థలు లేకుండా గడపాల్సివచ్చింది. పైగా అబద్ధాలకు తోడు, ఈ విద్యుత్ సంక్షోభం గురించి తెలిసినా టెన్నిస్‌ ఆడేందుకు ఆయన వెళ్ళారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్