శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బ్యాంకింగ్‌ సంక్షోభం నేపథ్యంలో పరాగ్వే అధ్యక్షుడు రాజీనామా

4 గంటల క్రితం

బ్యాంకింగ్‌ సంక్షోభం నేపథ్యంలో 
పరాగ్వే అధ్యక్షుడు రాజీనామా
- దిగువసభలో అభిశంసన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 07:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- దిగువసభలో అభిశంసన

ఆసన్సియన్‌ : ఆన్‌‌లైన్‌‌లో రుణాలు ఇచ్చే ఉయ్‌‌నో బ్యాంక్‌ ‌కుప్పకూలిన నేపథ్యంలో పరాగ్వే అధ్యక్షులు శాంటియాగొ పెనా గురువారం రాజీనామా చేశారు. బ్యాంకింగ్‌ రంగ సంక్ష‍ోభంపై దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో నిరసనలు, ఆందోళనలు పెల్లుబికాయి. ప్రజలు మదుపు చేసుకున్న లక్షలాది డాలర్ల డిపాజిట్లు స్తంభించిపోయాయి. ఈ పరిణామాల కారణంగా అధ్యక్షుడికి పాలక కొలరాడో పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది. దాంతో ఆయన రాజీనామా చేశారు. దేశ సుస్థిరత, సామాజిక శాంతి, ప్రజాస్వామ్య వ్యవస్థలను పరిరక్షించుకునే ఉద్దేశ్యంతోనే తాను రాజీనామా చేసినట్లు పెనా సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే పార్లమెంట్‌ ‌దిగువ సభ 78-0 ఓట్ల తేడాతో అధ్యక్షుడిని అభిశంసించింది. ఆయనపై మోపిన అభియోగాలను సెనెట్‌‌కు పంపింది.

30 లక్షల మందికి పైగా వినియోగదారులు వున్న ఈ బ్యాంక్‌‌లో దాదాపుగా 80 కోట్ల డాలర్ల మేరా ప్రజల డిపాజిట్లు వున్నాయి. బ్యాంక్‌ ‌నియంత్రణ వాటాదారైన గ్రూపొ వాగ్వెజ్‌‌కు అనుబంధం వుండే కంపెనీలకు అధిక మొత్తంలో రుణాలు ఇచ్చినట్లు, అకౌంటింగ్‌ అవకతవకలు జరిగినట్లు ‌నియంత్రణాధికారులు వెలికితీయడంతో ఈ బ్యాంక్‌ ఒక్కసారిగా కుప్పకూలింది. అవినీతి సంబంధిత నేరాలతో 27 మంది అధికారులు, అసోసియేట్‌‌లపై ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. విచారణ ముగిసేవరకు ఆరుగురు ఎగ్జిక్యూటివ్‌‌లను జైలుకు పంపారు. ఈ బ్యాంక్‌ ‌సంక్షోభం వేలాదిగా ఉద్యోగాలను దెబ్బతీసింది. తమ పొదుపు మొత్తాలను తీసుకునే పరిస్థితుల్లో డిపాజిటర్లు లేరు. కాగా పెనా స్థానంలో ఉపాధ్యక్షులు పెడ్రో అలియానా బాధ్యతలు స్వీకరిస్తారని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్