శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

న్యూజిలాండ్‌లో రాజకీయ అనిశ్చితి

4 గంటల క్రితం

న్యూజిలాండ్‌లో రాజకీయ అనిశ్చితి
- సాధారణ మెజారిటీకి ఒక్క సీటు దూరంలో ప్రధాని లక్సన్‌ 
- కింగ్‌ మేకర్‌‌గా ఆపర్చునిటీ పార్టీ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 08:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- సాధారణ మెజారిటీకి ఒక్క సీటు దూరంలో ప్రధాని లక్సన్‌

- కింగ్‌ మేకర్‌‌గా ఆపర్చునిటీ పార్టీ

విల్లింగ్టన్‌ : న్యూజిలాండ్‌‌లో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఈ నెల 7వ తేదీన జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి రాలేదు. దీంతో రాబోయే వారాల్లో సంక్లిష్టమైన రాజకీయ ఎత్తుగడలు చోటు చేసుకునే అవకాశం వుందని భావిస్తున్నారు. శుక్రవారం విడుదలైన ఎన్నికల ఫలితాల్లో కన్జర్వేటివ్‌ ‌నేషనల్‌ ‌పార్టీకి చెందిన ప్రధాని క్రిస్టొఫర్‌ ‌లక్సన్‌ ‌నేతృత్వంలోని పాలక మధ్యే మితవాద సంకీర్ణానికి పార్లమెంట్‌‌లో మెజారిటీకి ఒక్క సీట్ తక్కువైంది. 2023 నుండి లక్సన్‌ ‌న్యూజీలాండ్‌‌ను పాలిస్తున్నారు. కానీ నేషనల్‌ ‌పార్టీకి దాని జూనియర్‌ ‌భాగస్వామ్య పార్టీలు ఎసిటి, న్యూజీలాండ్‌ ‌ఫస్ట్‌ ఈ రెండింటికీ కలిపి 65 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇందులో నేషనల్‌ ‌పార్టీవి 40 సీట్లు రాగా మిగిలిన రెండు పార్టీలకు వరుసగా 13, 12 సీట్లు వచ్చాయి. 130 సీట్లు గల పార్లమెంట్‌‌లో మెజారిటీకి 66 సీట్లు అవసరం కాగా, ఆఒక్క సీటే తక్కువైంది. కాగా ప్రతిపక్ష లేబర్‌ ‌పార్టీ 36 సీట్లు గెలుచుకుంది. క్విలె వాంగ్‌ ‌నేతృత్వంలోని సెంట్రిస్ట్‌ ‌ఆపర్చునిటీ పార్టీ ఏడు సీట్లు గెలుచుకుని, కింగ్‌ ‌మేకర్‌‌గా ఆవిర్భవించింది. అయితే, ఆర్థిక విధానం, వాతావరణ మార్పులు, ఇమ్మిగ్రేషన్‌, ఆదివాసీ మావోరి హక్కులపై అభిప్రాయ బేధాలు వున్న కారణంగా చర్చలు కష్టమే కావచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రధాని లక్సన్‌ ‌మాట్లాడుతూ, పూర్తి స్థాయి పదవీకాలాన్ని పూర్తి చేసే సామర్ధ్యం గల సుస్థిర ప్రభుత్వం ప్రస్తుతం న్యూజీలాండ్‌‌కు అవసరమని అన్నారు. రాబోయే రోజుల్లో రాజకీయ మంతనాలు జరుగుతాయని భావిస్తున్నారు. ఒక ఒప్పందానికి రావడంలో విఫలమైనట్లైతే వచ్చే ఏడాది మరోసారి ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్