శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

54 వేల మందినీ ఓటర్ల జాబితాలో తిరిగి చేర్చండి

20 నవంబర్, 2026

sir
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 10:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- అండమాన్‌లో ఎస్‌ఐఆర్‌పై సిపిఎం డిమాండ్‌

పోర్ట్ బ్లెయిర్ : అండమాన్‌ నికోబార్‌ దీవుల ఓటర్ల జాబితా నుంచి ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) అనంతరం తొలగించిన అర్హులైన 54 వేల మందినీ తిరిగి నమోదు చేయాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. 2025-26లో నిర్వహించిన ఎస్‌ఐఆర్‌లో తొలగించబడిన ఓటర్ల పేర్లను పునరుద్ధరించకుండా ప్రస్తుత ఓటర్ల జాబితాను సవరించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేసింది. అండమాన్, నికోబార్ దీవుల ముఖ్య ఎన్నికల అధికారి (సిఇఒ) ఆధ్వర్యంలో ఈ నెల 17న విజయపురం (పోర్ట్ బ్లెయిర్)లో జరిగిన జాతీయ రాజకీయ పార్టీల నాయకుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి డి. అయ్యప్పన్‌ ఈ మేరకు డిమాండ్‌ చేశారు. అండమాన్ నికోబార్ పార్లమెంటరీ నియోజకవర్గ ఓటర్ల జాబితాను సవరించడానికి ప్రతిపాదిత షెడ్యూల్ గురించి రాజకీయ పార్టీలకు వివరించడానికి నిర్వహించిన ఈ సమావేశంలో సిఇఒకు సిపిఎం నేతలు ఒక లేఖను అందజేశారు. ఎస్‌ఐఆర్‌ వల్ల వేలాదిమంది అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయారని సిపిఎం గత ఏడాది సెప్టెబర్‌ 25న లేఖ సమర్పించిన విషయాన్ని, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పదేపదే వ్యతిరేకించిన విషయాన్ని అయ్యప్పన్‌ గుర్తు చేశారు. పార్లమెంటరీ నియోజకవర్గం ఓటర్ల జాబితా నుండి 9,191 మంది మరణించిన ఓటర్లతో సహా 64,014 మంది ఓటర్లను తొలగించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించడంతో, పార్టీ ఆందోళనలు నిజమయ్యాయని అయ్యప్పన్ తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ నాయకుడు పి. సత్యపాల్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్