mh ad
గురువారం, 25 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మారని ట్రంప్ యుద్ధోన్మాదం . .

3 గంటల క్రితం

trump
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 25, 2026, 08:35 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఇరాన్ పై యుద్ధానికి మరోసారి భారీ నిధుల డిమాండ్

- ట్రంప్ ప్రతిపాదనపై కాంగ్రెస్‌లో తీవ్ర వ్యతిరేకత

వాషింగ్టన్ : ఇరాన్ పై అమెరికా - ఇజ్రాయిల్ సాగిస్తున్న యుద్ధోన్మాదంతో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీరు ఏమాత్రం మారలేదు. ఓ వైపు ఇరాన్ తో శాంతి చర్చలు జరుపుతూ . . మరోవైపు ఇరాన్‌పై యుద్ధాన్ని కొనసాగించేందుకు మరిన్ని నిధులు సమకూర్చాలని ట్రంప్ కాంగ్రెస్‌ను కోరారు. ఇందుకోసం సుమారు ₹7.53 లక్షల కోట్లు (87.6 బిలియన్ డాలర్లు) అదనపు నిధుల ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం బుధవారం కాంగ్రెస్‌కు పంపింది. ఈ నిధుల్లో అత్యధిక భాగం ఇరాన్ యుద్ధ కార్యకలాపాలకే కేటాయించడంతో, ఇప్పటికే యుద్ధంపై అసంతృప్తిగా ఉన్న పలువురు చట్టసభ సభ్యులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వైట్ హౌస్ కాంగ్రెస్‌కు పంపిన అదనపు నిధుల అభ్యర్థనలో సైన్యానికి సుమారు ₹5.77 లక్షల కోట్లు (67.15 బిలియన్ డాలర్లు) కేటాయింపు ప్రతిపాదించారు. గతంలో ఆమోదించిన భారీ రక్షణ వ్యయాలకు అదనంగా ఈ నిధులను కోరడం రాజకీయంగా వివాదాస్పదంగా మారింది.

వైట్ హౌస్ ప్రకారం, ఈ నిధులు ఇరాన్ యుద్ధానికి సంబంధించిన కార్యాచరణ ఖర్చులు, సైనిక సిబ్బంది నిర్వహణ, యుద్ధ సంసిద్ధత, ఆయుధ నిల్వల పునర్నిర్మాణం, అలాగే రహస్య భద్రతా కార్యక్రమాల నిర్వహణ కోసం వినియోగించనున్నారు. అదనంగా, అమెరికా రక్షణ పరిశ్రమను బలోపేతం చేయడం, కొత్త ఆయుధాల కొనుగోలు, కీలక సైనిక సామర్థ్యాల అభివృద్ధి కోసం సుమారు ₹1.81 లక్షల కోట్లు (21 బిలియన్ డాలర్లు) కేటాయించాలని ప్రతిపాదించారు.

అయితే యుద్ధం విస్తరిస్తున్న నేపథ్యంలో మరిన్ని నిధులు కేటాయించడాన్ని కాంగ్రెస్‌లోని పలువురు సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే భారీ రక్షణ వ్యయాలు ఉన్నప్పటికీ మరోసారి అదనపు నిధులు కోరడం సమర్థనీయమా అనే అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్