శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గాజాకు మానవతా సహాయం ఆలస్యం చేయొద్దు

12 నవంబర్, 2026

gaza
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026, 08:46 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఇజ్రాయిల్‌కు ఐరాస విజ్ఞప్తి

గాజా: గాజాలో చలికాలం, భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మానవతా సహాయాన్ని ఆలస్యం చేయవద్దని ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఇజ్రాయిల్‌కు విజ్ఞప్తి చేసింది. ఇజ్రాయిల్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు గాజాకు సహాయం అందించకుండా ఉండటం సరైన నిర్ణయం కాదని ఐరాస మానవతా సహాయ విభాగం అధిపతి టామ్ ఫ్లెచర్ అన్నారు. గాజాలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అన్ని సరిహద్దు మార్గాలను వెంటనే తెరిచి ఆహారం, మందులు, ఇతర అత్యవసర వస్తువులను పంపించాలని కోరారు. గాజాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వేలాది తాత్కాలిక గుడారాలు నీట మునిగాయి. సుమారు 70 వేల గుడారాలు దెబ్బతినడంతో వేలాది మంది నిరాశ్రయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వారికి బలమైన తాత్కాలిక ఆశ్రయాలు, దుప్పట్లు, చలికాలపు దుస్తులు, పరుపులు, హీటర్లు అత్యవసరంగా అవసరమని ఐరాస తెలిపింది. అలాగే నీటిని తొలగించే పంపులు, జనరేటర్లు, ఇంధనం కూడా అందించాలని కోరింది.

సహాయ సంస్థలు గాజాలో స్వేచ్ఛగా పనిచేసేందుకు అనుమతించాలని, వాణిజ్య కార్యకలాపాలను పునరుద్ధరించాలని ఫ్లెచర్ ఇజ్రాయిల్‌ను కోరారు. అయితే, గాజాకు సహాయం అందించడంలో తాము విఫలం కాలేదని ఇజ్రాయిల్ ఖండించింది. తమ శాంతి ప్రణాళిక అమలుకు హమాస్ అడ్డుపడుతోందని పేర్కొంది. మరోవైపు, ఐరాస అంచనాల ప్రకారం 2023 అక్టోబర్‌లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గాజాలో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ ప్రజల కష్టాలు మాత్రం తగ్గడం లేదు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్