- పెరూలో ఘోర అగ్నిప్రమాదం
లిమా: పెరూ రాజధాని లిమాలోని లా విక్టోరియా జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుని ఐదుగురు చిన్నారులతో సహా ఒకే కుటుంబానికి చెందిన 10 మంది సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఉన్న 17 మంది కుటుంబ సభ్యుల్లో ఏడుగురు ప్రాణాలతో బయటపడగా, ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పెరూ జాతీయ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా నిప్పుపెట్టినట్లు అనుమానిస్తున్నారు. పరుపుల తయారీ, ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల వ్యాపారం నిర్వహిస్తున్న ఆ కుటుంబానికి కొంతకాలంగా డబ్బు డిమాండ్ చేస్తూ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇంటి బయట పార్క్ చేసిన మోటార్‌సైకిళ్లకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించగా, ఆ మంటలు వేగంగా ఇంటిలోని పరుపుల తయారీ సామగ్రికి వ్యాపించినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషాదంలో ఐదుగురు పిల్లలు, నలుగురు పెద్దలు, మరో ఒకరు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.








కామెంట్‌లు (0)