స్టాక్‌హోమ్ : రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు జరిపిన ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ ఏడాది నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. ఫ్రాన్స్‌కు చెందిన హెన్రీ కగాన్, జపాన్‌కు చెందిన కెన్సో సొవాయ్‌లు ఈ పురస్కారం అందుకోనున్నారు. అసిమెట్రిక్ ఆర్గానిక్ సింథసిస్‌లో నాన్‌లీనియర్ ప్రభావాలు, ఆటోకాటలిసిస్ ఆవిష్కరణలు చేసినందుకు గాను నోబెల్‌కు ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. హెన్రీ కాగన్, కెన్‌సో సోయి అభివృద్ధి చేసిన రసాయనిక చర్యలు శతాబ్దానికి పైగా ఉన్న ఓ రసాయనిక రహస్యానికి పరిష్కారం చూపాయని రసాయన శాస్త్ర నోబెల్ కమిటీ చైర్ హైనర్ లింకె తెలిపారు. హోమోకైరాలిటీ సహజసిద్ధంగా ఎలా ఏర్పడుతుందన్న ప్రశ్నకు వీరి పరిశోధనలు సమాధానం చూపించాయని ఆయన పేర్కొన్నారు. వీరు అభివృద్ధి చేసిన రసాయనిక చర్యలు అద్భుతమైనవని అన్నారు.
హెన్రీ కాగన్ ఫ్రాన్స్‌లోని బులోన్-బిలాంకూర్‌లో జన్మించారు. ఫ్రాన్స్‌లోని ఓర్సేలో ఉన్న యూనివర్సిటీ పారిస్-సుడ్‌తో ఆయన అనుబంధం ఉంది. కెన్‌సో సోయి జపాన్‌లోని హిరోషిమాలో జన్మించారు. టోక్యో యూనివర్సిటీ ఆఫ్ సైన్స్‌తో ఆయన అనుబంధంగా ఉన్నారు.
మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్ అభివృద్ధి చేసినందుకు గాను గతేడాది ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం లభించిన సంగతి తెలిసిందే.








కామెంట్‌లు (0)