మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కొలంబియా భూకంపం: 250కి చేరిన మృతుల సంఖ్య

6 రోజుల క్రితం

deaths
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 12, 2026, 08:44 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- 2,700 మందికి పైగా గల్లంతు

- శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం ముమ్మరంగా గాలింపు

బొగోటా: కొలంబియాలో సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భూకంపం ధాటికి కూలిపోయిన భవనాల శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటివరకు కనీసం 250 మంది మృతి చెందినట్లు అంచనా వేయగా, 2,700 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం. ఈ శతాబ్దంలో కొలంబియా ఎదుర్కొన్న అత్యంత విధ్వంసకర భూకంపాల్లో ఇదొకటిగా అధికారులు పేర్కొంటున్నారు. సోమవారం ఉదయం 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో అనేక అపార్ట్‌మెంట్లు, ఇళ్లు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు కుప్పకూలాయి. పలు భవనాలకు భారీగా పగుళ్లు ఏర్పడ్డాయి. భూకంపం అనంతరం భారీగా కూలిన భవనాల శిథిలాలు రోడ్లపై పేరుకుపోయాయి. శిథిలాల కింద ఎవరైనా ప్రాణాలతో ఉండే అవకాశం ఉందన్న ఆశతో సహాయక సిబ్బంది అత్యంత జాగ్రత్తగా గాలింపు చేపడుతున్నారు. కాంక్రీట్ శిథిలాలను తొలగిస్తూ బాధితులను సురక్షితంగా బయటకు తీసేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతుండటంతో భూకంపం వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్