- ఇజ్రాయిల్ బాహువులు ఎక్కడికైనా చేరుకుంటాయి’ : నెతన్యాహు
టెల్ అవీవ్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు శత్రువులకు హెచ్చరిక జారీ చేశారు. తమ దేశంపై దాడికి ప్రయత్నించే వారిని ఎక్కడ ఉన్నా, ఎప్పుడైనా ఇజ్రాయిల్ సైన్యం వెంబడిస్తుందని ఆయన పేర్కొన్నారు. “మాతో ఆటలు వద్దు. మా బాహువులు మిమ్మల్ని ఎక్కడైనా, ఎప్పుడైనా చేరుకుంటాయి” అని నెతన్యాహు హెచ్చరించారు. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో శత్రువులు ఇజ్రాయిల్‌పై దాడికి ప్రయత్నించే అవకాశాలు ఉన్నట్లు సూచనలు ఉన్నాయని ఆయన అన్నారు. గాజాలో గత కొన్ని వారాల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చినట్లు నెతన్యాహు తెలిపారు. ఈ చర్యల్లో ఉత్తర గాజాలోని హమాస్ బ్రిగేడ్ కమాండర్ ఇస్ అల్-దిన్ బిక్ హతమైనట్లు ఇజ్రాయిల్ ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.
ఇజ్రాయిల్ సైన్యంపై దాడులకు ప్రణాళికలు రూపొందించడంలో, హమాస్‌లో కొత్త సభ్యులను చేర్చుకోవడంలో బిక్ కీలక పాత్ర పోషించాడని ఇజ్రాయిల్ పేర్కొంది. గాజాలో హమాస్‌ను పూర్తిగా నిర్మూలించే వరకు తమ చర్యలు కొనసాగుతాయని నెతన్యాహు స్పష్టం చేశారు.







కామెంట్‌లు (0)