బుధవారం, 30 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రానున్న నెలల్లో భారీ ఆహార సంక్షోభం: జైశంకర్

1 గంట క్రితం

jai sankar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 08:07 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూయార్క్: ప్రపంచం రానున్న నెలల్లో తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ హెచ్చరించారు. ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్–గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణల ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. న్యూయార్క్‌లో ఏషియా సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన జైశంకర్.. ఇంధనం, ఆహారం, ఎరువులు, ఆర్థిక రంగాల్లో ఏకకాలంలో ఏర్పడుతున్న ఒత్తిళ్లు పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే ఎరువుల కొరత తీవ్రంగా ఉందని, కీలక ధాన్య ఎగుమతిదారుల నుంచి సరుకుల రవాణాకు అంతరాయాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా బ్లాక్ సీ మార్గాల్లో రవాణా సమస్యలు ప్రపంచ ఆహార సరఫరాపై ప్రభావం చూపవచ్చని వివరించారు. అంతర్జాతీయ సహకారం, సరఫరా వ్యవస్థల స్థిరీకరణ అత్యవసరమని జైశంకర్ సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్