- 21 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలు వాహనాలు ఢీకొన్న ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెస్ట్రన్ కేప్ ప్రావిన్స్‌లోని ఎన్1 జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రిన్స్ ఆల్బర్ట్, లీయూ-గామ్కా పట్టణాల మధ్య రెండు మినీబస్ ట్యాక్సీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. అనంతరం మరో ఎస్‌యూవీ వాహనం వాటిని ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. సమాచారం అందుకున్న అత్యవసర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం కారణంగా ఎన్1 రహదారిపై రాకపోకలను నిలిపివేశారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. రహదారి భద్రతా నిబంధనలపై అధికారులు దృష్టి సారించారు.








కామెంట్‌లు (0)