సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హెచ్-1బి వీసాలపై లక్ష డాలర్ల ఫీజు పొడిగింపు

19 సెప్టెంబర్, 2026

h1b
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 12:25 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

​వాషింగ్టన్‌ : అమెరికాలో అడుగు పెట్టి కెరీర్ నిర్మించుకోవాలనుకునే వేలాది మంది భారతీయ ఐటి నిపుణుల ఆశలపై అధ్యక్షుడు ట్రంప్ మరోసారి నీళ్లు చల్లారు. హెచ్-1బి వీసాలపై లక్ష డాలర్ల (దాదాపు రూ. 96 లక్షల రూపాయలు) దరఖాస్తు ఫీజు నిబంధనను 2027 సెప్టెంబర్ వరకు పొడిగించారు. ఈ మేరకు వైట్‌హౌస్ శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో భారత ఐటి అవుట్‌సోర్సింగ్ సంస్థల వీసా దరఖాస్తులు భారీగా పడిపోయాయి. ఇప్పటికే అమెరికాలో మాస్టర్స్ చదివే విద్యార్థులు, వీసా రెన్యువల్ చేసుకునే వారికి మినహాయించారు. అయితే, కోర్టుల్లో దీనిపై న్యాయపోరాటం కొనసాగు తోంది. ఈ నిర్ణయంతో భారత టెక్ రంగాన్ని, ముఖ్యంగా దేశీయ అవుట్‌సోర్సింగ్ సంస్థలను తీవ్రంగా కలవరపెడుతోంది. గతంలో కేవలం రెండు వేల నుంచి ఐదు వేల డాలర్ల లోపు మాత్రమే ఉన్న ఈ దరఖాస్తు ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచడంతో భారతీయ ఐటి కంపెనీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. గతంలో భారీగా వీసాలను స్పాన్సర్ చేసే స్టాఫింగ్, అవుట్‌సోర్సింగ్ కంపెనీల నుంచి వచ్చే దరఖాస్తులు 92 శాతం తగ్గిపోయినట్లు ప్రభుత్వ రికార్డులు వెల్లడిస్తున్నాయి. మొత్తం హెచ్-1బి లబ్ధిదారుల్లో భారత్ వాటా 71 శాతంగా కాగా, ఈ మార్పులు భారత నిపుణులపైనే అత్యధిక ప్రభావం చూపుతున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్