జర్మనీ : జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి న్యూఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానానికి హైజాక్ హెచ్చరికలు రావడంతో అత్యవసరంగా జైపూర్కు మళ్లించారు. బోయింగ్ 787 ఎఐ-2030 విమానం జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అనంతరం వివిధ భద్రతా సంస్థలకు చెందిన సిబ్బంది విమానంలోకి ప్రవేశించి విస్తృత తనిఖీలు చేపట్టారు. సాధారణంగా హైజాక్ వంటి సంఘటనలు జరిగినప్పుడు ఉపయోగించే అత్యున్నత స్థాయి భద్రతా ప్రోటోకాల్ను విమానాశ్రయ అధికారులు ఇక్కడ అమలు చేశారని సంబంధిత అధికారుల తెలిపారు. ఢిల్లీకి దాదాపు 280 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజస్థాన్లోని జైపూర్ నగరంలో ఉదయం 9.45 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ల్యాండింగ్ పూర్తయిన తర్వాత, అధికారులు విమానం వద్దకు చేరుకుని, ప్రయాణికులు కిందకు దిగడానికి నిచ్చెనలను ఏర్పాటు చేశారు. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే ప్రయాణికులను, సిబ్బందిని కిందకు దిగేందుకు అనుమతించారు.
Print Editionఎయిరిండియా విమానానికి హైజాక్ హెచ్చరిక..!
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 14, 2026, 11:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)