మంగళవారం, 28 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition​బ్యాంకాక్‌ పబ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 27 మంది మృతి

13 జులై, 2026

bangkok-pub-fire
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 13, 2026, 11:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​బ్యాంకాక్‌ : ప్రముఖ పర్యాటక కేంద్రం థాయ్‌‌లాండ్‌‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బ్యాంకాక్‌లో నగరంలోని ఒక ప్రముఖ పబ్‌లో సంభవించిన ఈ ప్రమాదంలో కనీసం 27 మంది మరణించగా, మరో 63 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు బ్యాంకాక్ గవర్నర్ తెలిపారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నగర ఉత్తర భాగంలోని పబ్ లో అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగాయి. కొద్ది నిమిషాల్లోనే మంటలు భవనం మొత్తం వ్యాపించడంతో అక్కడ ఉన్న ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలను కాపాడుకునేందుకు పలువురు బయటకు పరుగులు తీయగా, మరికొందరు భవనం లోపలే చిక్కుకుపోయారు. ఘటన స్థలాన్ని సందర్శించిన థాయ్ ప్రధానమంత్రి అనుటిన్ చార్న్‌విరాకుల్ మాట్లాడుతూ, “ఇప్పటివరకు 27 మంది మరణించారు. గాయపడిన చాలా మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది” అని తెలిపారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, చాటుచాక్ జిల్లాలోని ‘రోంగ్ బీర్ నా లాట్ ఫ్రావో’ అనే పబ్‌లో ఈ ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మొదట కాలిన గాయాలతో ఉన్న ఒక వ్యక్తిని రక్షించినప్పటికీ, అనంతరం భవనం లోపల అనేక మంది చిక్కుకుపోయినట్లు గుర్తించారు. మంటల నుంచి తప్పించుకోవడానికి పలువురు పబ్‌లోని మరుగుదొడ్లలో దాక్కున్నారని సమాచారం. అయితే, దట్టమైన పొగ, వేగంగా వ్యాపించిన మంటల కారణంగా వారు బయటకు రాలేకపోయారు. మృతులలో అధికశాతం మంది టాయిలెట్ ప్రాంతంలోనే లభించినట్లు అధికారులు భావిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్