గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘నిజమైన హీరో’ అంటూ నెతన్యాహు ప్రశంసలు

1 గంట క్రితం

israel
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 10:44 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- 174 మంది ప్రాణాలు కాపాడిన భారతీయ పైలట్..

టెల్ అవీవ్: దుబాయ్–టెల్ అవీవ్ ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన తీవ్ర ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ కాక్‌పిట్ తలుపు తెరిచి ప్రయాణికులు దాడిచేసిన కో-పైలట్‌ను అదుపులోకి తీసుకునేలా చేసిన భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌ను నెతన్యాహు ప్రశంసించారు. ఆయన అసాధారణ ధైర్యంతో 174 మంది ప్రాణాలను కాపాడారని, ఆయనను నిజమైన హీరోగా అభివర్ణించారు. ఫ్లైదుబాయ్ FZ1073 విమానంలో కో-పైలట్ కెప్టెన్ మచ్చార్‌పై దాడి చేసిన అనంతరం విమానం తీవ్రంగా కిందికి దిగిపోయింది. పరిస్థితిని గమనించిన ప్రయాణికులు, సిబ్బంది కాక్‌పిట్‌లోకి ప్రవేశించి దాడి చేసిన పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానం సౌదీ అరేబియాలోని తబూక్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. “తీవ్రంగా గాయపడినా పోరాడి, ప్రతిఘటించి కాక్‌పిట్ తలుపు తెరిచారు. తద్వారా ప్రయాణికులు, సిబ్బంది దాడిచేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోగలిగారు” అని నెతన్యాహు పేర్కొన్నారు. మచ్చార్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్