మనామా: ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలపై యెమెన్ ప్రభుత్వ సైన్యం, సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు సైనిక చర్యలను ముమ్మరం చేశాయి. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యెమెన్ అధ్యక్ష నాయకత్వ మండలి ఛైర్మన్ రషద్ అల్-అలిమి ఈ విషయాన్ని వెల్లడించారు. సౌదీ సంకీర్ణ దళాలు, యెమెన్ సైన్యానికి చెందిన యుద్ధ విమానాలు రాజధాని సనాతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వైమానిక దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఈ దాడులకు ప్రతిస్పందనగా రియాద్‌లోని సౌదీ జాతీయ చమురు సంస్థ అరామ్కోకు చెందిన సౌకర్యాలపై వైమానిక దాడులు జరిపినట్లు హౌతీ సైనిక ప్రతినిధి యాహ్యా సారి ప్రకటించారు. దాడి లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించిందని, చమురు ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించిందని హౌతీలు పేర్కొన్నారు. అయితే హౌతీల వాదనలను సౌదీ సంకీర్ణ దళాలు ఖండించాయి. రియాద్‌తో పాటు సమీప ప్రాంతాల్లోని వాయు రక్షణ వ్యవస్థలు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉన్నాయని సౌదీ అధికారులు తెలిపారు. దేశ సరిహద్దుల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన డ్రోన్లు, క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నామని వెల్లడించారు. దీంతో యెమెన్‌లో కొనసాగుతున్న ఘర్షణలు మరోసారి ప్రాంతీయ ఉద్రిక్తతలకు దారితీసే పరిస్థితి నెలకొంది.
హౌతీలపై భారీ సైనిక చర్య
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 05, 2026, 07:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)