ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హోర్ముజ్ జలసంధి గుండా లక్షలాది బ్యారెళ్ల చమురు రవాణా

07 అక్టోబర్, 2026

trump
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026, 07:58 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ట్రంప్ కీలక వ్యాఖ్యలు

వాషింగ్టన్: గత కొద్ది రోజులుగా హోర్ముజ్ జలసంధి గుండా లక్షలాది బ్యారెళ్ల చమురు రవాణా జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మధ్యప్రాచ్యంలో ఘర్షణలు ప్రారంభం కాకముందుతో పోలిస్తే ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు సరఫరా మరింత ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. వైట్‌హౌస్ వెలుపల విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్‌లో ద్రవ్యోల్బణం దాదాపు 300 శాతానికి చేరుకుందని, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఘర్షణల ప్రభావంతో ప్రపంచ చమురు నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయని సౌదీ అరామ్కో వెల్లడించింది. అరామ్కో చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమీన్ నాసర్ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే, తగ్గిపోయిన చమురు నిల్వలు తిరిగి మునుపటి స్థాయికి చేరుకోవడానికి రెండేళ్ల వరకు సమయం పట్టే అవకాశం ఉందని హెచ్చరించారు.

మధ్యప్రాచ్యంలో సంఘర్షణల కారణంగా చమురు సరఫరా దెబ్బతినడంతో అత్యవసర డిమాండ్‌ను తీర్చేందుకు పలు దేశాలు భారీగా ఇంధనాన్ని మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వలు తగ్గుతున్నాయని నాసర్ తెలిపారు. మరోవైపు చమురు ఉత్పత్తిలో తగ్గుదల, హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా రవాణా, ఎగుమతుల్లో ఏర్పడిన అంతరాయాలు ప్రపంచ చమురు మార్కెట్‌లో ఆందోళనలను మరింత పెంచుతున్నాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుల్లో ఒకటైన సౌదీ అరేబియాకు చెందిన అరామ్కో.. ముఖ్యంగా ఆసియా దేశాలకు చమురు ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్య ఘర్షణల ప్రభావంతో ప్రపంచ చమురు నిల్వలపై ఆందోళనలు పెరుగుతున్న వేళ అరామ్కో అధిపతి చేసిన హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్