న్యూఢిల్లీ: భారత్‌లో ఓటరు జాబితాల నుంచి సుమారు 13 కోట్ల మంది ఓటర్ల పేర్లు తొలగించారన్న అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని ప్రముఖ అమెరికా పత్రిక న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ఓటరు జాబితాల సవరణ ప్రక్రియపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసేవరకు తమ నిరసనలు, ఆందోళనలు కొనసాగుతాయని ఆందోళలనకారులు స్పష్టం చేశారు. వీధుల్లోకి వచ్చి ఆందోళనలు కొనసాగిస్తామని, ప్రజాస్వామ్యాన్ని తిరిగి సాధిస్తామని వారు ప్రకటించారు. ఓటరు జాబితాల్లో నకిలీ పేర్లు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన వివరాలు, ఇతర తప్పులను తొలగించడమే ఈ ప్రక్రియ లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ క్రమంలో అర్హులైన ఓటర్ల పేర్లు కూడా తొలగిపోయే ప్రమాదం ఉందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పేదలు, వలస కార్మికులు, మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజలు తగిన పత్రాలు సమర్పించలేక ఓటు హక్కును కోల్పోయారని అభిప్రాయపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ముస్లిం ఓటర్లు ఈ ప్రక్రియ వల్ల అసమానంగా ప్రభావితమయ్యారనే ఆరోపణలు కూడా ఉన్నాయని కథనం పేర్కొంది. ఓటరు జాబితాల సవరణలో పారదర్శకత పాటించాలని, పేర్లు తొలగించే ముందు సంబంధిత ఓటర్లకు సమాచారం అందించి, అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పించాలని ఆందోళలనకారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఓటు హక్కు పరిరక్షణపై ఈ పరిణామాలు చర్చకు దారితీశాయని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది.
13 కోట్ల ఓటర్ల తొలగింపుపై భారత్‌లో తీవ్ర ఆగ్రహం : న్యూయార్క్ టైమ్స్ కథనం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 09, 2026, 09:40 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)