ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‌గాజాలో శాశ్వతంగా కాల్పుల విరమణ...

06 అక్టోబర్, 2026

uno
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026, 11:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

: ఐరాస చీఫ్‌ పిలుపు

న్యూయార్క్‌ : గాజాలో శాశ్వతంగా కాల్పుల విరమణ పాటించాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పిలుపునిచ్చారు. ఇజ్రాయిల్‌‌పై హమాస్‌ ‌దాడికి మూడేళ్లు పూర్తయిన సందర్భంలో గుటెర్రెస్‌ ఈ విజ్ఞప్తి చేశారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి జరిగిన సంగతి తెలిసిందే. "కాల్పుల విరమణ శాశ్వతం కావాల్సిన సమయం ఆసన్నమైంది. భారీ ఎత్తున మానవతా సహాయాన్ని అందించాల్సిన సమయం వచ్చింది. అంతర్జాతీయ చట్టాన్ని గౌరవించాల్సిన సమయం కూడా ఆసన్నమైంది" అని గుటెర్రెస్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఇక వచ్చే ఏడాది అయినా కాల్పులు, సంఘర్షణలకు గుర్తుగా నిలవకుండా, భవిష్యత్తును నిర్మించాలనే నూతన సంకల్పానికి కూడా గుర్తుగా నిలవాలి. భవిష్యత్తులో ఇజ్రాయెలీయులు, పాలస్తీనియన్లు తమ హక్కులు, గౌరవం, ఆకాంక్షలు నెరవేర్చుకుని శాంతి భద్రతలతో పక్కపక్కన జీవించగలగాలి" అని గుటెర్రెస్ తన ప్రకటనలో స్పష్టం చేశారు. పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం గాజాపై ఇజ్రాయిల్ మారణహోమంలో 74,200 మందికి పైగా మరణించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్