గురువారం, 20 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పెన్సిల్వేనియాలో పోలీసు హెలికాప్టర్‌ను ఢీకొన్న చిన్న విమానం.. పైలట్‌ మృతి

1 గంట క్రితం

Pennsylvania
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 20, 2026, 11:55 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

కార్లిస్లే : అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో చిన్న విమానం, రాష్ట్ర పోలీసు హెలికాప్టర్‌ ఢీకొన్న ఘటనలో విమానం పైలట్‌ మృతి చెందారు. బుధవారం సాయంత్రం కార్లిస్లేలోని ఓ చిన్న విమానాశ్రయంలో రన్‌వే సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.


ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌ఎఎ) వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రమాదంలో సెస్నా 150 విమానం, బెల్‌ 407 పోలీసు హెలికాప్టర్‌ ఢీకొన్నాయి. రన్‌వేపైకి దిగుతున్న సమయంలో చిన్న విమానం ఒక్కసారిగా దిశ మార్చుకుని నేల సమీపంలో ఉన్న హెలికాప్టర్‌ను ఢీకొన్నట్లు పెన్సిల్వేనియా స్టేట్‌ పోలీస్‌ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం అత్యంత తీవ్రంగా జరిగిందని అధికారులు తెలిపారు. ఢీకొన్న ఘటనలో విమానం ముక్కలుగా ధ్వంసమైంది. హెలికాప్టర్‌ ప్రధాన రోటర్‌ బ్లేడ్లు, వెనుక భాగంలోని టెయిల్‌ బూమ్‌ దెబ్బతిని, అది పక్కకు ఒరిగి కూలిపోయింది. హెలికాప్టర్‌లో ఉన్న ఇద్దరు పోలీసు అధికారులు ప్రమాదంలో చిక్కుకున్నప్పటికీ, కిటికీ ద్వారా బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారని అధికారులు తెలిపారు. శిక్షణలోభాగంగా వారు హెలికాప్టర్‌ను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అన్నారు. విమానంలో పైలెట్‌ ఒక్కరే ఉన్నారా లేదా అనే అంశాన్ని కూడా దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టినట్లు ఎఫ్‌ఎఎ, నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డు (ఎన్‌టిఎస్‌బి) వెల్లడించాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్