పెరూలోని మధ్య జునిన్ ప్రాంతంలో శనివారం రాత్రి వరుసగా 5.1, 3.7 తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించాయి. ఈ వరుస భూకంపాల దాటికి ఆరుగురు మృతి చెందగా, 21 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో 48 ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి. మరో 18 ఇళ్లు దెబ్బతిన్నాయి. సుమారు 300 మంది ప్రభావితమై, వందలాది మంది నిరాశ్రయులయ్యారు. పెరూ నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ ప్రకారం లీమాకు తూర్పున 300 కిలోమీటర్ల దూరంలో భూకంప తీవ్రత నమోదయ్యాయి. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతుండగా, బాధితులకు అత్యవసర సాయం అందిస్తున్నారు. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉండటంతో పెరూలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి.
పెరూలో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి
5 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 20, 2026, 07:35 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)