వాషింగ్టన్: అమెరికాలోని మిన్నియాపాలిస్ నగరంలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురు పోలీసు అధికారులు గాయపడ్డారు. బుధవారం మధ్యాహ్నం మిన్నియాపాలిస్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ దాడికి పాల్పడిన నిందితుడు కూడా మరణించాడని పోలీసులు తెలిపారు. అయితే, నిందితుడు ఎలా మరణించాడనే విషయాన్ని పోలీసులు స్పష్టం చేయలేదు. బుధవారం సాయంత్రం 4:30 గంటలకు కాల్పుల గురించి పోలీసులకు 911 కాల్ అందింది. సమాచారం అందుకున్న తర్వాత పోలీసులు బహుళ అంతస్తుల భవనం వద్దకు చేరుకోగా, అక్కడ నిరంతర కాల్పుల శబ్దాలు వినిపించాయని పోలీసులు తెలిపారు. తనిఖీ చేయగా, ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా, అక్కడ అతను మరణించాడు. ఈ దాడిలో గాయపడిన మిన్నియాపాలిస్‌కు చెందిన ముగ్గురు అధికారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.








కామెంట్‌లు (0)