ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

హర్మూజ్ జలసంధి మాదే...ట్రంప్ సంచలన ప్రకటన

1 గంట క్రితం

Trump
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 10:17 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని ‘అమెరికా కొత్త భూభాగం’గా అభివర్ణిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు హర్మూజ్ జలసంధిని అమెరికా భూభాగంగా చూపిస్తున్న ఒక మ్యాప్‌ను ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఆదివారం మరోసారి పోస్ట్ చేశారు. ఇరాన్‌పై కఠినమైన ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతున్న తరుణంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

గతంలోనూ ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. సౌత్ కరోలినాలో జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడుతూ “నేను హర్మూజ్ జలసంధిని ప్రస్తుతం అమెరికా భూభాగంగానే చూస్తున్నాను” అని స్పష్టం చేశారు. ఇరాన్ నౌకలు, ఓడరేవులపై అమెరికా నావికాదళం దిగ్బంధనం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ జలమార్గం గుండా రాకపోకలను అమెరికాయే నియంత్రిస్తోందని, దీనిని అధికారికంగా అమెరికా భూభాగంగా ప్రకటించే ఆలోచనను కూడా ఆయన గతంలో ప్రస్తావించారు. ప్రపంచంలోని ఐదో వంతు సముద్ర చమురు రవాణా ఈ మార్గం గుండానే జరుగుతుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్