సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

బీజింగ్‌లో 'టియాన్‌గాంగ్' రోబో సంచలనం

9 గంటల క్రితం

robo
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 10:15 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- తుఫాన్‌ వేగంతో పరుగు

- 400 మీటర్ల ప్రపంచ రికార్డు బద్దలు

​బీజింగ్: చైనా రాజధాని బీజింగ్‌లో జరుగుతున్న 2వ ప్రపంచ హ్యూమనాయిడ్ రోబో గేమ్స్‌లో ‘టియాన్‌గాంగ్’ అనే రోబో సంచలనం సృష్టించింది. ఆదివారం నాడు జరిగిన లార్జ్ గ్రూప్ 400 మీటర్ల రేసులో ఈ రోబో 38.15 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని, మనుషులు నెలకొల్పిన ప్రపంచ రికార్డు కంటే వేగంగా పరుగెత్తింది.

ఈ విభాగంలో పురుషుల 400 మీటర్ల ప్రపంచ రికార్డు 43.03 సెకన్లు. 2016 రియో ఒలింపిక్స్‌లో దక్షిణాఫ్రికా అథ్లెట్ వేడీ వాన్ నీకెర్క్ ఈ రికార్డును నెలకొల్పారు. దశాబ్దకాలంగా ఈ రికార్డు చెక్కుచెదరకుండా నిలిచింది. తాజాగా టియాన్‌గాంగ్ రోబో ఈ సమయాన్ని దాదాపు 5 సెకన్లు మించి, మెరుగైన సమయంతో లక్ష్యాన్ని చేరుకుంది. ఇదే రేసులో ‘‘జుయిఫెంగ్ జైజై’’ రోబోతో పాటు, జింగ్‌హాంగ్ డైనమిక్స్ టీమ్, హానర్ షువాంగ్‌చి టీమ్‌లకు చెందిన రోబోలు కూడా పోటీపడ్డాయి. మానవాళి సాధించిన అథ్లెటిక్ ఘనతలను రోబోలు అధిగమిస్తుండటం హ్యూమనాయిడ్ రోబోటిక్స్ రంగంలో చైనా సాధిస్తున్న వేగవంతమైన పురోగతికి నిదర్శనంగా నిలుస్తోంది. మొదటి ప్రపంచ హ్యూమనాయిడ్ రోబో గేమ్స్ నిర్వహించిన కొద్ది కాలంలోనే, ఇప్పుడు రెండో ఎడిషన్‌లో రోబోలు మానవ ప్రపంచ రికార్డులను అధిగమించే స్థాయికి చేరుకోవడం విశేషం.

బోల్ట్‌‌ను దాటేసిన రోబో..

పరుగుల వీరుడు అథ్లెటిక్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డును రోబోలు అధికమించాయి. ‘‘వరల్డ్ హ్యూమనోయిడ్ రోబో గేమ్స్’’ రెండవ ఎడిషన్‌లో మానవ మాత్రులకు సాధ్యం కాని వేగాన్ని రోబోలు ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచాయి. రేసు ప్రారంభంలో కాస్త వెనుకబడినప్పటికీ, ముగింపునకు చేరువయ్యే క్రమంలో ‘టియాంగాంగ్ ఆల్ట్రా’ అద్భుతమైన వేగాన్ని అందుకొని అగ్రస్థానంలో నిలిచింది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హానర్ రూపొందించిన ‘లైట్నింగ్’ అనే రోబో 9.47 సెకన్లలో 100 మీటర్ల లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచింది. ఇది కూడా ఉసేన్ బోల్ట్ రికార్డును అధిగమించడం గమనార్హం. అయితే రేసు పూర్తయ్యాక ఈ రోబోలను అదుపు చేయడం కష్టంగా మారింది. వాటి వేగాన్ని కట్టడిచేయడానికి ఏర్పాటు చేసిన రక్షణ మ్యాట్‌‌లు నిలవలేకపోయాయి.

గతేడాది జరిగిన ఇదే రోబో టియాంగాంగ్ ఆల్ట్రా 100 మీటర్ల రేసును పూర్తి చేయడానికి 21.50 సెకన్ల సమయం తీసుకుంది. అయితే, ఈ సారీ సగానికి పైగా ఆ సమయాన్ని తగ్గించి రికార్డు సృష్టించింది. రోబోటిక్స్ రంగాన్ని తమ వ్యూహాత్మక పరిశ్రమగా చైనా మలుచుకుంటుంది. దీనికి కృత్రిమ మేథ (ఎఐ) సాయంతో వేగంగా అడుగులు వేస్తోంది. ఈ పోటీల్లో కేవలం పరుగు పందెం మాత్రమే కాకుండా ఫుట్‌బాల్, డ్యాన్స్, పరిశ్రమల్లో పనిచేసే నైపుణ్యాలతో సహా మొత్తం 51 రకాల ఈవెంట్లను నిర్వహిస్తున్నారు. బీజింగ్ నేషనల్ స్పీడ్ స్కేటింగ్ ఓవల్‌లో బుధవారం వరకు జరిగే ఈ క్రీడల్లో 16 దేశాల నుంచి 666 టీమ్‌లు, 2,056 రోబోలు పాల్గొంటున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్