సోమవారం, 13 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

2030 నాటికి న్యూజిలాండ్‌ తో రూ.35 వేల కోట్ల వాణిజ్యం

1 రోజు క్రితం

pm modi nz
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 12:07 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- లక్సాన్‌తో మోడీ భేటీ

అక్లాండ్ : భారత్‌, న్యూజిలాండ్‌ తమ ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తూ వ్యూహాత్మక భాగస్వామ్యంగా అప్‌గ్రేడ్ చేసుకున్నాయి. రాబోయే నాలుగేండ్లలో రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత విస్తరించేందుకు వ్యూహాత్మక భాగస్వామ్య రోడ్‌మ్యాప్ 2030ని ఆవిష్కరించాయి. 2030 నాటికి వస్తువులు, సేవల రంగాల్లో వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సుమారు రూ.35 వేల కోట్లకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాయి. అలాగే రాబోయే 15 ఏండ్ల పాటు భారత్‌లో 20 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు న్యూజిలాండ్‌ హామీ ఇచ్చింది. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్‌ లక్సాన్‌తో విస్తృత చర్చలు జరిపారు. ఈ భేటీలో 10 ఒప్పందాలతో సహా మొత్తం 18 కీలక నిర్ణయాలు చేశారు. ఈ మేరకు దేశాల అధికార యంత్రాంగం సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్