మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ట్రంప్‌ టారిఫ్‌లను సవాలు చేసిన 25 డెమోక్రటిక్‌ పాలిత రాష్ట్రాలు

04 ఆగస్టు, 2026

Trump
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 04, 2026, 03:47 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

వాషింగ్టన్‌ : భారత్‌ సహా 60 దేశాలపై అధ్యక్ష‍ుడు ట్రంప్‌ విధించిన సెక్ష‍న్‌ 301 టారిఫ్‌లను సోమవారం డెమోక్రటిక్‌ నేతృత్వంలోని 25 అమెరికా రాష్ట్రాల కూటమి అంతర్జాతీయ వాణిజ్య న్యాయస్థానంలో సవాలు చేసింది. సెక్ష‍న్‌ 301 కింద భారత్‌ ప్రస్తుతం 10శాతం టారిఫ్‌ల పరిధిలోకి వస్తుంది. అదే సమయంలో, అదనపు టారిఫ్‌లను విధించేందుకు అవకాశం కలిగిన మరో విచారణ పెండింగ్‌లో ఉంది. బలవంతపు శ్రమను అరికట్టడంలో విఫలమైన అంశాన్ని ప్రస్తావిస్తూ ట్రంప్‌ గత నెల తాజాగా 60 దేశాలపై టారిఫ్‌లను 10శాతం నుండి 12.5శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. జులై 24తో గడువు ముగిసిన 10 శాతం ప్రపంచవ్యాప్త సుంకాల స్థానంలో ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చింది.
వాణిజ్య కోర్టుకు 25 అమెరికా రాష్ట్రాలు
భారత్‌ సహా 60దేశాలపై సుంకాలు విధించాలన్న ట్రంప్ పరిపాలన నిర్ణయానికి వ్యతిరేకంగా 25 రాష్ట్రాలు సోమవారం నాడు 'యూఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్'లో ఫిర్యాదు చేశాయి. ఈ చర్య వలన దేశవ్యాప్తంగా వినియోగదారులు, వ్యాపార సంస్థలకు ఖర్చులు పెరుగుతాయని వాదించాయి. ఈ టారిఫ్‌లు చట్ట విరుద్ధమని ప్రకటించాల్సిందిగా న్యూయార్క్‌ అటార్నీ జనరల్ లెటిషియా జేమ్స్‌, గవర్నర్‌ కాథీ హోచుల్‌ సహా డెమోక్రాట్‌ రాష్ట్రాలు కోర్టును కోరాయి. సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటికీ.. ట్రంప్‌ యంత్రాంగం మరోసారి చట్టవిరుద్ధమైన టారిఫ్‌లను విధించేందుకు యత్నిస్తోందని జేమ్స్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ తాజా టారిఫ్‌లతో కుటుంబాలు, వ్యాపారాలపై సుంకాలు అధికమవుతాయని తెలిపారు. బలవంతపు శ్రమను అరికట్టాలన్న సాకుతో ఈ టారిఫ్‌లను ఏకపక్ష‍ంగా విధించారని ఫిర్యాదు పేర్కొంది. టారిఫ్‌ల విధానంలో చేర్చిన ఉత్పత్తి మినహాయింపులతో పాటు ట్రంప్ యంత్రాంగం సమర్థతను బలహీనపరుస్తాయని వాదించింది. బలవంతపు శ్రమతో కేవలం మూడు ఉత్పత్తులను మాత్రమే ట్రంప్‌ యంత్రాంగం టారిఫ్‌లను విధించేందుకు ఎంపిక చేసినట్లు ఫిర్యాదు గుర్తించింది. త్వరితగతిన జరిగిన సంప్రదింపుల ప్రక్రియలో ప్రభావిత దేశాల సాక్ష్యాలను, సమర్పించిన ప్రజాభిప్రాయాలను యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యుఎస్‌టిఆర్‌) కార్యాలయం పరిశీలించడంలో విఫలమైందని ఫిర్యాదు పేర్కొంది. ప్రపంచ సరఫరా గొలుసులలో బలవంతపు కార్మిక సమస్యను పరిష్కరించడంలో సుంకాలు సహాయపడతాయన్న ప్రభుత్వ వాదనకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది.

టారిఫ్‌లను ఎదుర్కోనున్న భారత్‌ సహా పలు దేశాలు
భారత్‌ మరో 16 దేశాలతో కలిసి 10 శాతం సుంకంత పరిధిలోకి వస్తుంది. గతంలో, భారతీయ దిగుమతులపై 12.5 శాతం సుంకం విధించాలని అమెరికా ప్రతిపాదించింది. బలవంతపు శ్రమతో తయారైన వస్తువుల దిగుమతిని నిషేధిస్తూ జూన్ 14న భారత్‌ తన విదేశీ వాణిజ్య విధానాన్ని సవరించిన తర్వాత, ఈ టారిఫ్‌ రేటు తగ్గింది. సెక్ష‍న్‌ 301 కింద ప్రామాణిక నిబంధనలను పాటించనందున ట్రంప్‌ యంత్రాంగం చట్టాన్ని ఉల్లంఘించిందని 25 అమెరికా రాష్ట్రాలు వ్యాజ్యంలో వాదించాయి. ఈ చట్టాన్ని సమర్థించుకునేందుకు అవకాశం లేదని, ఆయన కోరుకున్న విధంగా దేశాలపై విస్తృతమైన సుంకాలు విధించే అధికారం అధ్యక్ష‍ునికి లేదని చట్టం, రాజ్యాంగం స్ఫష్టం చేశాయని జేమ్స్‌ పేర్కొన్నారు. "టారిఫ్‌లనేవి పన్నులేనని, అధ్యక్షుడు ఎంతగా కోరుకున్నప్పటికీ, ఆయన అనుసరించిన విఫలమైన, చట్టవిరుద్ధమైన ఆర్థిక విధానం వల్ల ఏర్పడే అదనపు భారాన్ని అమెరికా ప్రజలు మోయలేరు, అలాగే మోయకూడదని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్