సోమవారం, 17 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

సిరియాలో ఐరాస చీఫ్‌ పర్యటన

25 జులై, 2026

un
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 25, 2026, 10:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

డమాస్కస్‌ : ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ శనివారం ఉదయం సిరియా చేరుకున్నారు. గత 17 సంవత్సరాల కాలంలో ఐరాస అధిపతి సిరియాలో పర్యటించడం ఇదే మొదటిసారి. డమాస్కస్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న గుటెర్రెస్‌, ఆయన ప్రతినిధి బృందానికి సిరియా విదేశాంగ మంత్రి అసాద్‌ అల్‌-షైబానీ స్వాగతం పలికారు. సిరియా పర్యటనలో భాగంగా దేశాధ్యక్షుడు అహ్మద్‌ అల్‌-షారాతో గుటెర్రెస్‌ సమావేశమవుతారు. అల్‌-ఖైదా మాజీ కమాండర్‌ అయిన అల్‌-షారాపై గత సంవత్సరం వరకూ ఐరాస భద్రతా మండలి ఆంక్షలు అమలులో ఉన్నాయి. 2009 తర్వాత సిరియాలో ఐరాస చీఫ్‌ తొలిసారిగా పర్యటిస్తున్నారు. సుదీర్ఘ కాలం సిరియాను పాలించిన బాషర్‌ అల్‌-అస్సాద్‌ను పదవీచ్యుతుడిని చేసిన అల్‌-షారా 2004లో దేశాధ్యక్షుడు అయ్యారు. అప్పటి నుంచి ఆయన అంతర్జాతీయ సంబంధాల పునరుద్ధరణ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్