స్టాక్హోం : ఈ ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ఇద్దరు శాస్త్రవేత్తలను వరించింది. ‘అసిమిట్రిక్ ఆర్గానిక్ సింథసిస్లో అటో కెటాలసిస్, నాన్ లీనియర్ ప్రభావాలను ఆవిష్కరించినందుకు’ రసాయన శాస్త్రవేత్తలు హెన్రీ కాగన్ (ఫ్రాన్స్), కెన్సో సోయీ (జపాన్)లను 2026 సంవత్సరానికి నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ బుధవారం ప్రకటించింది.
ఔషధాలు, రుచులు, సువాసనలు, కొత్త పదార్ధాల తయారీ కోసం ప్రతిస్పందన (రియాక్షన్)లను వృద్ధి చేసే కెమిస్ట్లకు హెన్రీ కాగన్ ఆవిష్కరణలు బాగా ఉపయోగపడతాయని స్వీడిష్ అకాడమీ తన ప్రకటనలో పేర్కొంది. దీనివల్ల కెమిస్ట్లు తమ రోజువారీ పనుల్లో ఉపయోగించుకోవడానికి కొత్త సాధనాలు వచ్చాయని పేర్కొంది. పైగా ఈ ఆవిష్కరణలు రసాయన శాస్ర్తంలోని అత్యంత రహస్యాల్లో ఒకటైన ‘అణు మిస్టరీ’ని ఛేదించడానికి ఉపయోగపడతాయని పేర్కొంది. ఇక మరోవైపు కెన్సో సోయీ అభివృద్ధిపరిచిన ‘సోయీ రియాక్షన్’ జీవరాశి ఆవిర్ఢావాన్ని అర్ధం చేసుకోవాలనుకునే కెమిస్ట్ల్లో సరికొత్త ఉత్సాహాన్ని రగులుస్తోందని అకాడమీ పేర్కొంది.








కామెంట్లు (0)