- డ్రాపటి నియామకం
కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ సైన్యాధిపతి జనరల్ ఒలెక్సాండర్ సిర్స్కీని పదవి నుంచి తొలగించి, ఆయన స్థానంలో మిఖైలో డ్రాపటిని కొత్త సైన్యాధిపతిగా నియమించారు. కీవ్‌తో పాటు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సైనిక నాయకత్వానికి వ్యతిరేకంగా రోజులుగా కొనసాగుతున్న ప్రజా నిరసనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సైనిక వ్యవస్థలో మార్పులు కోరుతూ ప్రజలు ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో జెలెన్స్కీ ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఇటీవలే ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. అధ్యక్షుడు జెలెన్స్కీ రక్షణ మంత్రి మైఖ్లో ఫెడోరోవ్‌ను కూడా మార్చారు. సిర్స్కీతో ఉన్న విభేదాలే ఫెడోరోవ్ మార్పునకు కారణమని వదంతులు వచ్చాయి.







కామెంట్‌లు (0)