గురువారం, 03 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition20 ఏళ్లలో @20 ట్రిలియన్ డాలర్లు

13 గంటల క్రితం

Anantha Nageswaran
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 10:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • భారత ఆర్థిక వ్యవస్థపై సిఇఎ అంచనా

న్యూఢిల్లీ : వచ్చే 2046 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 20 ట్రిలియన్ డాలర్ల మార్కుకు చేరువ కావచ్చని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (సిఇఎ) వి అనంత నాగేశ్వరన్ అంచనా వేశారు. రాబోయే దశాబ్దంలో భారత్ నిజ వృద్ధి రేటు సగటున 7 శాతంగా, అమెరికా ద్రవ్యోల్బణం సుమారు 3 శాతంగా ఉంటే డాలర్ పరంగా వార్షిక వృద్ధి రేటు 10 శాతానికి చేరుతుందని తెలిపారు. 2047 నాటికి పూర్తిస్థాయి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే మాత్రం భారత ఆర్థిక వ్యవస్థ ఏటా సుమారు 9.3 శాతం చొప్పున విస్తరించాల్సి ఉంటుందన్నారు. 2000 నుంచి 2024 మధ్య కాలంలో భారత్ నిజ వృద్ధి రేటు సగటున 6.3 శాతంగా నమోదైనా, డాలర్ పరంగా వార్షిక వృద్ధి రేటు 8.8 శాతానికి చేరిందని నాగేశ్వరన్ పేర్కొన్నారు. నీతి ఆయోగ్ అంచనాల ప్రకారం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే భారత్ జిడిపి సుమారు 30 ట్రిలియన్ డాలర్లకు, తలసరి ఆదాయం 18,000 డాలర్లకు చేరాల్సి ఉంటుందన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్